ఆనందయ్య మందుపై ఆయుష్ పాజిటివ్ రిపోర్ట్..
Send us your feedback to audioarticles@vaarta.com
కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మందుపై ఆయుష్ కమిషనర్ పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. మందు తయారీలో వాడే పదార్థాలన్నీ శాస్త్రీయంగానే ఉన్నాయని రాములు చెబుతున్నారు. అలాగే ల్యాబ్ నుంచి కూడా పాజిటివ్ రిపోర్టే వచ్చిందని ఆయన వెల్లడించారు. రాములు ఎదుట ఆయుర్వేద మందు తయారీని ఆనందయ్య చేసి చూపించనున్నారు. ఆనందయ్య మందును ఎలా తయారు చేస్తారో పరిశీలిస్తామని రాములు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నేటి నుంచి మరింత కఠినంగా లాక్డౌన్
ఈ సందర్భంగా రాములు మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం ముత్తుకూరులో కొంతమందితో, ఆనందయ్య వద్ద పనిచేసేవారితో మాట్లాడామని తెలిపారు. ఆనందయ్య మందును తీసుకున్నవారి అభిప్రాయాలను సైతం సేకరిస్తామని రాములు వెల్లడించారు. ఐసీఎంఆర్ బృందం పరిశీలన తర్వాత వారితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటామని రాములు వెల్లడించారు. మందు తయారీ అధ్యయనం తర్వాత నివేదికకు వారం పైనే పడుతుందన్నారు. కాగా.. ఆనందయ్య ఆయుర్వేద మందుపై సీఎంఆర్, ఆయూష్ బృందాలు అధ్యయనం చేస్తున్నాయని జేసీ హరేంద్రప్రసాద్ తెలిపారు. నివేదిక వచ్చేందుకు వారం, 10 రోజులు పట్టొచ్చని.. ఫైనల్‌గా ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాతే మందు పంపిణీ చేపడతామని ఆయన వివరించారు. అప్పటి వరకు ప్రజలెవరూ కృష్ణపట్నం రావొద్దని జేసీ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ప్రజలు ఇంకా కృష్ణపట్నానికి క్యూ కడుతూనే ఉన్నారు. మందు అందించడం లేదని తెలిసి నిరాశగా వెనుదిరుగుతున్నారు. మరోవైపు గ్రామానికి చెందిన కొందరు మందు స్టాకు చేసి బహిరంగంగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఇంకొందరు వారు తయారుచేసిన మందుని ఆనందయ్య మందుగా చెబుతూ మోసాలకు పాల్పడుతున్నారు. మందు కోసం వచ్చే వారి నుంచి వేలకి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ.5 వేల నుంచి 10 వేల రూపాయలకు అమ్ముతున్నారు. ఆనందయ్య తన సొంత డబ్బుతో మందు తయారుచేసి వేల మందికి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఆనందయ్య మందు ప్రజలకు అందే అవకాశం లేదు. అప్పుడు కూడా ఐసీఎంఆర్, ఆయుష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఆనందయ్య మందు ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com