షామిలిపై పాజిటివ్ రిపోర్ట్స్‌

  • IndiaGlitz, [Monday,October 05 2015]

బాల‌నటిగా స్టార్‌డ‌మ్‌ని సొంతం చేసుకున్న న‌టి షామిలి. అప్ప‌ట్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక అభిమాన‌గ‌ణం ఉండేదంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌టి క్రేజ్ ని మూట‌గ‌ట్టుకున్న షామిలిని హీరోయిన్‌గా చూడాల‌ని చాలా మంది ఆశ‌ప‌డ్డారు. దానికి త‌గ్గ‌ట్టే 'ఓయ్‌'తో నాయిక‌గా తొలి అడుగులు వేసింది షామిలి. అయితే ఎంతో జోష్‌ఫుల్‌గా ఆమె క్యారెక్ట‌రైజేష‌న్ ఉంటుంద‌ని అంతా ఆశ‌ప‌డితే.. అందుకు భిన్నంగా క‌నిపించి అంద‌ర్నీ నిరాశ‌ప‌రిచింది షామిలి. ఆ స‌మ‌యంలో ఏమ‌నుకుందో ఏమో కానీ.. ఏకంగా ఆరేళ్ల పాటు విరామం తీసుకుని ఇప్పుడు వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కాలు చేసేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది షామిలి.

ఇప్ప‌టికే త‌మిళంలో ధ‌నుష్ ప‌క్క‌న ఓ చిత్రం.. విక్ర‌మ్ ప్ర‌భు ప‌క్క‌న 'వీర శివాజీ' చిత్రాల్లో న‌టిస్తూ టాక్ ఆఫ్ కోలీవుడ్‌గా నిలిచింది ఈ అమ్మ‌డు. త‌న నుంచి అభిమానులు ఏమి ఆశిస్తున్నారో అవ‌న్నీ ఉండేలా.. అలాగే గ్లామ‌ర్ కోణంలోనూ అల‌రించేలా షామిలి తీసుకుంటున్న జాగ్ర‌త్త‌లు చూసి త‌మిళ తంబీలు కోలీవుడ్‌కి ఓ స్టార్ హీరోయిన్ సిద్ధ‌మౌతోంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. సెట్స్‌లో షామిలి ఎన‌ర్జీ లెవ‌ల్స్ చూసి చిత్ర యూనిట్స్ సైతం షామిలీ ఈజ్ బ్యాక్ అంటూ పాజిటివ్ రిపోర్ట్ ఇస్తున్నార‌ట‌. మ‌రి తెలుగులో షామిలి కొత్త ఇన్నింగ్స్ కి ఏ చిత్రం కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తుందో.

More News

'ది ఐస్' మూవీ రివ్యూ

అవయవాల మార్పిడిపైన మనకు వచ్చిన సినిమాలు తక్కువే. వచ్చిన వాటిలోనూ కళ్ళ మీద వచ్చిన సినిమాలే ఎక్కువ. తాజాగా మీరాజాస్మిన్ నటించిన ‘ది ఐస్’ కూడా అలాంటి సినిమానే.

సురేంద‌ర్ రెడ్డి తొలి అడుగు

గ‌తేడాది 'రేసుగుర్రం'తో సూప‌ర్‌హిట్‌ని.. ఈ ఏడాది 'కిక్ 2'తో సూప‌ర్ ఫ్లాప్‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి.

'రుద్ర‌మ‌దేవి'కి రివ‌ర్స్ సెంటిమెంట్‌

గుణ‌శేఖ‌ర్‌.. ఈ పేరు వింటే 'సొగ‌సు చూడ‌త‌ర‌మా', 'రామాయ‌ణం', 'చూడాల‌ని ఉంది', 'ఒక్క‌డు' వంటి క్లాసిక్స్ అన‌ద‌గ్గ సినిమాలు గుర్తుకు వ‌స్తాయి. ఎట్ ద సేమ్ టైమ్‌.. త‌లుచుకుంటే కించిత్ భ‌యం పుట్టించే డిజాస్ట్ర‌స్ ఫిల్మ్స్ కూడా గుర్తుకు వ‌స్తాయి.

స‌మంతకి ఆ పోరు త‌ప్ప‌ట్లేదు

తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఫుల్‌ఫామ్‌లో ఉంది స‌మంత‌. ఈ నెలాఖ‌రులో రిలీజ్‌కి సిద్ధ‌మైన విక్ర‌మ్ '10 ఎండ్ర‌తుకుల్ల‌'తో క‌లుపుకుని ఆమె చేతిలో ఎనిమిది చిత్రాల వ‌ర‌కు ఉన్నాయి.

అనుష్క రేర్ రికార్డ్

హాలీవుడ్ త‌ర‌హాలోనో.. బాలీవుడ్ త‌ర‌హాలోనో ద‌క్షిణాదిన సీక్వెల్స్ త‌రుచుగా రూపొంద‌వు. ఒక‌వేళ అప్పుడ‌ప్పుడు తెర‌కెక్కినా అవి అంత‌గా ఆద‌ర‌ణ‌కు నోచుకోవు.