కొలంబస్కు ప్రీ పాజిటివ్ బజ్
Send us your feedback to audioarticles@vaarta.com
దసరా రేస్‌లో పాజిటివ్ నోట్‌తో విడుదల అవుతున్న మూవీ కొలంబస్. రీసెంట్గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి విడుదలకు ముందే పాజిటివ్ వచ్చింది.
అంతకుముందు ఆ తర్వాత, కేరింత వంటి హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న యువ హీరో సుమంత్ అశ్విన్ నటించిన తాజా చిత్రం కొలంబస్. కొత్త డైరెక్టర్ ఆర్. సామల డైరెక్ట్ చేసిన ఈ మూవీ దసరా కానుకగా విడుదల కానుంది. ఏకేఎస్ ఎంటర్టయిన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత అశ్వినికుమార్ సహదేవ్ ఈ సినిమాని నిర్మించాడు. ఇది ఆయనకు తొలి చిత్రం. క్లీన్ యూత్ ఫుల్ ఎంటర్టయినర్గా రూపొందిన ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు కాంప్లిమెంట్స్ అందించారు. అశ్విన్‌కి జోడీగా చిన్నదాన నీ కోసం ఫేమ్ మిస్తీ చక్రవర్తి, రన్ రాజా రన్ భామ శీరత్ కపూర్ జతకట్టారు. వీరి గ్లామర్ సినిమాకి మరో ఎస్సెట్.
యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టయినరే అయినా కథ, కథనంతోపాటు టేకింగ్‌లోనూ దర్శకుడు సామల కొత్తగా ప్రెజెంట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ట్రెండ్‌కి తగ్గ కథతో సామల మేజిక్ చేశాడని సెన్సార్ సభ్యులు కితాబిచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇక, రీసెంట్గా విడుదలయిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జేబీ స్వరపరిచిన ట్యూన్స్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు చార్ట్ బస్టర్స్‌లో ఈ పాటలదే హంగామా.
విజయదశమి కానుకగా పలు చిన్న చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నా.. ట్రెండ్‌కి తగ్గ కథతో రూపొందడం సినిమాకి అడ్వాంజేట్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు దర్శకనిర్మాతలు. దసరా రేస్‌లో విన్నర్ తమ సినిమానేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com