వైఎస్ జగన్ ఆదేశిస్తే నేను రెడీ..: పోసాని

  • IndiaGlitz, [Wednesday,July 31 2019]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ గెలిచి.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం పీఠమెక్కాలని ఆకాంక్షించిన వారిలో టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఒకరు. అంతేకాదు.. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ.. జగన్‌ను ఆకాశానికెత్తింది కూడా ఈయనే.!. టాలీవుడ్ తరఫున పలువురు వైసీపీ తీర్థం పుచ్చుకుని ప్రస్తుతం పదవులు అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పోసానికి కూడా ఏదో ఒక పదవి దక్కుతుందని అందరూ భావించారు.

అంతేకాదు.. పోసాని రీల్ లైఫ్‌లో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ఇలా పాలిటిక్స్ పరంగా పలు పాత్రల్లో నటించి మెప్పించారు. అయితే రియల్ లైఫ్‌లో కూడా అనుభవించాలనే తన కోరికను వైఎస్ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారని.. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు సైతం వచ్చాయి. అనారోగ్యం నుంచి కోలుకున్న పోసాని బుధవారం నాడు మీడియా మీట్ పెట్టి తనపై వచ్చిన పుకార్లన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టేశారు.

జగన్ పిలిస్తే నేను రెడీ..!

వైఎస్ జగన్ సీఎం కావాలని మనస్పూర్తిగా కోరుకున్నాను. నేను ఏ పదవులూ కోరుకోవడం లేదు. పదవులు ఆశించకుండా వైసీపీ కోసం పనిచేశాను. సీఎం జగన్ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తాను. జగన్ పిలిచి ఏ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను చేయాల్సిన పనులు చాలా ఉండేఉంటాయి. నేను ఇంత వరకూ ఎవర్నీ ఫలానా పనులు ఇవ్వండి.. పదవులు అడుక్కోలేదు అని పోసాని చెప్పుకొచ్చారు.

జగన్‌ భేష్!

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. కొద్దిరోజుల్లోనే హామీలన్నీ అమల్లోకి తెస్తున్నారు. టెండర్లపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం చాలా మంచి నిర్ణయం. ఖాళీ ఖజానాతో వైఎస్ జగన్ సీఎం పీఠంపై కూర్చున్నారు. ప్రాధాన్యతల వారీగా నిధులు కేటాయిస్తున్నారు. ఏపీలో సినీ రంగానికి కూడా మంచి రోజులు వస్తాయి అని జగన్‌పై పోసాని ప్రశంసల వర్షం కురిపించారు.

More News

మెగాస్టార్‌ని టార్గెట్ చేసిన యువ హీరో

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరో. హీరోగా ఆయనకున్న క్రేజే వేరు.

ఇదేం ఖర్మరా బాబూ... మత పిచ్చితో జొమాటో ఆర్డర్ రద్దు!

నిజంగా ఈ వార్త చదివిన తర్వాత ఎంత పిచ్చోడ్రా బాబూ.. అనుకోక తప్పదు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుండటంతో ఇంటి ముందే అన్నీ వచ్చి వాలిపోతున్నాయ్..

ఆయన వల్లే బతికా.. ఇక చనిపోను: పోసాని

టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి అనారోగ్యంపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వదంతులు వచ్చిన విషయం విదితమే.

‘సైమా’కు ముఖ్యఅతిథులుగా చిరు, మోహన్‌లాల్

పాంట‌లూన్స్ సైమా (సౌత్ ఇండియన్‌ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్‌) ఎనిమిద‌వ అవార్డుల వేడుక ఆగ‌స్ట్ 15-16న ఖ‌తార్‌లో జ‌ర‌గ‌నున్న సంగతి తెలిసిందే.

'మేలుకో రైతన్నా.. మేలుకో' అంటున్న గద్దర్

ప్రజా గాయకుడు గద్దర్‌ పాటలు ఎంతో చైతన్యవంతంగా ఉంటాయి. అందర్నీ మేలుకొలిపే విధంగా ఉంటాయి. అలాంటి ఎన్నో అద్భుతమైన పాటల ద్వారా ప్రజా గాయకుడిగా పేరు తెచ్చుకున్న గద్దర్‌