రేవంత్ రెడ్డి వ్యవహారం : ఇది నా తప్పే సరిచేసుకుంటా!

  • IndiaGlitz, [Tuesday,June 09 2020]

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు గుప్పించారని సోషల్ మీడియాలో, యూ ట్యూబ్ చానెల్స్‌లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. నందమూరి బాలకృష్ణ, వైఎస్ జగన్ పాలన గురించి మాట్లాడారు. అయితే.. రేవంత్ గురించి మాట్లాడారని.. తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేకాదు.. రేవంత్ ఫ్యాన్స్, అనుచురులు సోషల్ మీడియాలో పోసానిని టార్గెట్ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పోసాని స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఎప్పుడూ కామెంట్ చేయలేదు..

‘గత ఆదివారం జరిగిన నా ప్రెస్‌‌మీట్‌లో గౌరవనీయులు ఎంపీ రేవంత్‌ రెడ్డి గారిని వ్వక్తిగతంగా, రాజకీయంగా విమర్శించానని, అలాగే ఘాటు వ్యాఖ్యలు చేసానని వార్తలు వచ్చాయి. అలాగే రేవంత్‌ రెడ్డిపై పోసాని ఫైర్‌.. రేవంత రెడ్డి పై పోసాని ఘాటు కామెంట్స్‌ అని సోషల్‌ మీడియాలోనూ.. యూ ట్యూబ్‌ చానల్స్‌లోనూ విపరీతంగా ట్రోల్‌ అవుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. అది చూసి నేను ఎంతో భాదపడ్డాను. అలాగే ఈ విషయం మీద ఎంపీ రేవంత్‌ రెడ్డి గారు.. ఆయన సన్నిహితులు, ఆయన అభిమానులు మనస్తాపం చెందారని తెలిసింది. నాకు తెలసిగానీ.. తెలియక గానీ నా లైఫ్‌‌లో రేవంత్‌ రెడ్డిగారి ని వ్వక్తిగతంగా గానీ.. రాజకీయ పరంగా కానీ ఎప్పుడూ కామెంట్‌ చేయలేదు. మొన్న జరిగిన ప్రెస్‌ మీట్‌లో కూడా నేను తప్పుగా మాట్లడలేదు. ఎప్పుడైనా ప్రెస్‌మీట్‌ లో ప్రతిపక్షం వారు విమర్శ చేసేటప్పుడు.. విమర్శతో పాటు సాక్ష్యం కూడా ఉంటే బాగుంటుంది. అలా ఉంటే అది జనం కూడా నమ్ముతారు. జనం గుండెల్లోకి కూడా మీ వార్త చేరుతుంది. అలా అయితే ప్రజలకు మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో మాట్లాడానే తప్ప నేను ఎవరిగురించి తప్పుగా మాట్లాడలేదు. మరీ ముఖ్యంగా రేవంత్‌ రెడ్డి గురించి నేను అసలు మాడ్లడలేదు. ఆయన అంటే నాకు ఎంతో గౌరవం. అయినా సోషల్‌ మీడియాలో యూట్యూబ్‌ ఛానల్స్‌లో బాగా ట్రోల్‌ అవుతున్నాయి కాబట్టి ఇది నాబాధ్యతగా తీసుకొని రేవంత్‌ రెడ్డికి.. ఆయన అభిమానులకు విచారం వ్వక్తం చేస్తున్నాను. ఇది నా తప్పుగానే భావించి.. ఈ తప్పును రెక్టిఫై చేసుకుంటాను’ అని పోసాని ప్రకటనలో పేర్కొన్నారు.

More News

ఏపీ-తెలంగాణల మధ్య చెక్ పోస్టులు ఎత్తేయలేదు..!

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5.0 విధించిన విషయం విదితమే. ఇందులో భాగంగా అంతర్ రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతులు ఉన్నాయి.

హీరోల్లారా.. జగన్‌రెడ్డికి మీరూ ఒక్క మాట చెప్పండి!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు హీరోలు, ప్రముఖ దర్శకులు, నిర్మాతలు.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవబోతున్న విషయం తెలిసిందే.

ఆందోళనకరంగా డైరెక్టర్ సంజనారెడ్డి ఆరోగ్య పరిస్థితి!

తెలుగు దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేసి ‘రాజుగాడు’ సినిమాతో టాలీవుడ్‌కు దర్శకురాలిగా పరిచయం అయిన సంజనారెడ్డి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

జగన్‌తో భేటీకి చార్టడ్ ఫ్లైట్‌లో చిరు, నాగ్, జక్కన్న

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దలు ఇవాళ భేటీ కానున్నారు.

కేసీఆర్, తలసానికి థ్యాంక్స్ చెప్పిన చిరు

టాలీవుడ్ సినిమా, టీవీ, సీరియల్స్ షూటింగ్స్ జరుపుకోవచ్చని ఇదివరకే చెప్పిన తెలంగాణ సర్కార్.. తాజాగా అందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది.