జగన్ పిలిచి పదవి ఇస్తానంటే.. పోసాని చెప్పిన మాటేంటో తెలుసా?
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ ఇండస్ట్రీలో పోసాని కృష్ణమురళీ ఎంత పాపులరో అందరికీ తెలిసిన విషయమే. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ఆయన విలక్షణమైన పాత్రలను పోషించారు. ఎందరో అభిమానాన్ని చూరగొన్నారు. రాజకీయంగానూ ఆయన తన వాణిని బలంగా వినిపిస్తుంటారు. తన అభిప్రాయాలు కచ్చితంగా చెబుతూ.. హాట్ టాపిక్ అవుతుంటారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలో ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో టీడీపీ సర్కార్‌పై ఆయన చేసిన విమర్శలు.. అప్పట్లో సంచలనమయ్యాయి. వైసీపీకి మద్దతుదారునిగా పోసాని చేసిన కామెంట్స్ ఇండస్ట్రీని కూడా షేక్ చేశాయి.
ఇటీవల ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. అమరావతి రాజధానిపై రైతులు చేస్తున్న పోరాటాన్ని కించపరుస్తూ పృథ్వీ మాట్లాడటాన్ని పోసాని తీవ్రస్థాయిలో ఖండించారు. అంతేగాక రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనడంపై మండిపడ్డారు. అనంతరం వైసీపీ అగ్రనాయకత్వం కూడా పృథ్వీపై సీరియస్ అయ్యి.. క్లాస్ తీసుకున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడిన మాటలు చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ అధినేత, సీఎం జగన్ తనకు పదవులు ఆఫర్ చేశారని పోసాని తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు, రాజ్యసభ పదవులు చేశారని.. ప్రత్యేకంగా తన ఇంటికి మనుషులను కూడా పంపించి మాట్లాడించారని.. కానీ తాను వాటిని సున్నితంగా తిరస్కరించానని ఆయన అన్నారు. జగన్‌కు ఎప్పుడూ మద్దతు ఇస్తానని.. తాను చనిపోయే వరకు ఆయన తనతో నవ్వుతూ, ప్రేమతో మాట్లాడితే చాలునని చెప్పినట్లు పోసాని అన్నారు. సదరు దూతల ద్వారా ఈ మాటలు విన్న జగన్.. పోసాని ప్రేమకు మురిసి పోయారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments