జగన్ పిలిచి పదవి ఇస్తానంటే.. పోసాని చెప్పిన మాటేంటో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో పోసాని కృష్ణమురళీ ఎంత పాపులరో అందరికీ తెలిసిన విషయమే. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ఆయన విలక్షణమైన పాత్రలను పోషించారు. ఎందరో అభిమానాన్ని చూరగొన్నారు. రాజకీయంగానూ ఆయన తన వాణిని బలంగా వినిపిస్తుంటారు. తన అభిప్రాయాలు కచ్చితంగా చెబుతూ.. హాట్ టాపిక్ అవుతుంటారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలో ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో టీడీపీ సర్కార్‌పై ఆయన చేసిన విమర్శలు.. అప్పట్లో సంచలనమయ్యాయి. వైసీపీకి మద్దతుదారునిగా పోసాని చేసిన కామెంట్స్ ఇండస్ట్రీని కూడా షేక్ చేశాయి.

ఇటీవల ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. అమరావతి రాజధానిపై రైతులు చేస్తున్న పోరాటాన్ని కించపరుస్తూ పృథ్వీ మాట్లాడటాన్ని పోసాని తీవ్రస్థాయిలో ఖండించారు. అంతేగాక రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనడంపై మండిపడ్డారు. అనంతరం వైసీపీ అగ్రనాయకత్వం కూడా పృథ్వీపై సీరియస్ అయ్యి.. క్లాస్ తీసుకున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడిన మాటలు చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ అధినేత, సీఎం జగన్ తనకు పదవులు ఆఫర్ చేశారని పోసాని తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు, రాజ్యసభ పదవులు చేశారని.. ప్రత్యేకంగా తన ఇంటికి మనుషులను కూడా పంపించి మాట్లాడించారని.. కానీ తాను వాటిని సున్నితంగా తిరస్కరించానని ఆయన అన్నారు. జగన్‌కు ఎప్పుడూ మద్దతు ఇస్తానని.. తాను చనిపోయే వరకు ఆయన తనతో నవ్వుతూ, ప్రేమతో మాట్లాడితే చాలునని చెప్పినట్లు పోసాని అన్నారు. సదరు దూతల ద్వారా ఈ మాటలు విన్న జగన్.. పోసాని ప్రేమకు మురిసి పోయారట.

More News

రెబల్ స్టార్ కృష్ణంరాజు బర్త్ డే సెలబ్రేషన్

దాదాపు 350కిపైగా చిత్రాల్లో నటించి.. సినీప్రియుల మదిలో రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకోవడమే కాక, నిర్మాతగానూ పదుల సంఖ్యలో హిట్‌ చిత్రాలు నిర్మించి తన అభిరుచిని చాటుకున్నారు

‘ఒరేయ్‌.. బుజ్జిగా’ షూటింగ్ పూర్తి. ఏప్రిల్ 3న విడుదల

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో

‘మిస్టర్ అండ్ మిస్’ఫస్ట్ లుక్ పోస్టర్

తెలుగు కథ, కథనాలు రేయాలిస్టిక్ కథల వైపు పరుగులు పెడుతున్నాయి. యూత్ ని ఎట్రాక్ట్ చేసే అంశాలలో సహజత్వం ముందు ఉంటుంది.

రెండు సినిమాలతో.. రూ.30 కోట్ల మార్కెట్ సొంతం చేసుకున్న భామ!

సారా అలీఖాన్.. సైఫ్ అలీఖాన్ కూతురు. స్టార్ నటుడి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ..

నాన్న, నా అభిమానుల కోరికను నెరవేర్చిన అనిల్ రావిపూడికి  థ్యాంక్యూ- మహేశ్ బాబు

సూపర్‌స్టార్‌ మహేశ్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌సమర్పణలోజి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో