పోసాని దర్శకత్వం..
Send us your feedback to audioarticles@vaarta.com
రచయితగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన పోసాని కృష్ణమురళి తదుపరి దర్శకుడిగా మారారు. 'ఆపరేషన్ దుర్యోధన' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత 'శ్రావణ మాసం' డిజాస్టర్ కావడంతో పోసాని దర్శకత్వానికి దూరంగా ఉంటూ నటుడిగా ఫుల్ బిజీగా మారిపోయారు.
ఒక వైపు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోసాని ఓ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారట.
రాజకీయ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితులను ఆధారంగా చేసుకుని తెరకెక్కబోయే ఈ సినిమా సెటైరికల్‌గా ఉంటుందని సమాచారం. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేసి సమ్మర్లో సినిమాను విడుదల చేసేలా పోసాని ప్లాన్ చేస్తున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments