పోసానికి కరోనా.. దర్శక, నిర్మాతలు నన్ను క్షమించాలి అంటూ..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా పోసాని తెలియజేశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని పోసాని అన్నారు. పోసాని టాలీవుడ్ లో బిజీ నటుడిగా కొనసాగుతున్నారు. నెగటివ్ రోల్స్ లో సైతం హాస్యం పండించడం పోసాని స్టైల్.
ఇదీ చదవండి: పెళ్లి వార్తలపై సుమంత్ క్లారిటీ.. వెడ్డింగ్ కార్డు వెనుక ఇంత జరిగిందా!
ఇదిలా ఉండగా ప్రస్తుతం పోసాని గచ్చిబౌలి లోని ఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోసాని ఆరోగ్యం బాగానే ఉంది. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
పోసానికి కరోనా సోకడంతో ఆయన నటిస్తున్న రెండు చిత్రాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి. దీనితో ఆ రెండు చిత్రాల సభ్యులు అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది. పోసానికి సన్నిహితంగా ఉన్నవారు టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నారట. దీనిపై పోసాని చింతించారు.
నాకు కరోనా సోకడంతో రెండు చిత్రాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి. దర్శక నిర్మాతలు నన్ను క్షమించాలి. ప్రేక్షకులు, సినీ పరిశ్రమ ఆశీస్సులతో, దేవుడి దయతో త్వరగా కోలుకుని షూటింగ్స్ లో పాల్గొంటానని పోసాని అన్నారు. తనవల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని పోసాని అన్నారు.
పోసాని రచయితగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు పని చేశారు. దర్శకుడిగా కూడా రాణించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారారు.
కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. స్టార్ సెలెబ్రిటీలు సైతం కరోనా బారీనపడి కోలుకున్నారు. సెకండ్ వేవ్ తర్వాత ఎట్టకేలకు శుక్రవారం నుంచి థియేటర్లు తెరుచుకుంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments