బాలయ్య గురించి పోసాని ఏమన్నారంటే...
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా సీనియర్ హీరో కమ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించడం.. ఇలా వివాదం ముదిరింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్ తిట్టిపోసుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం తాజాగా ప్రముఖ ప్రముఖ రచయత, నిర్మాత, దర్శకుడు,నటుడు అయిన పోసాని కృష్ణమురళి ఓ ఇంటర్వ్యూ వేదికగా స్పందించారు. బాలకృష్ణకు కోపం కాస్తా ఎక్కువేనని.. అంతేకాదు ఆయన కోపానికి కారణం కూడా ఉంటుందని పోసాని చెప్పుకొచ్చారు.
సీఎం అయినా.. చిన్నావాళ్లైనా..!
‘వ్యక్తిగతంగా ఆయన ఎవరిని ఏమి అనరు. ముఖానికి ముసుకేసుకోవడం ఆయనకు తెలియదు. ఏది ఉన్నా ముఖం మీదే అనేస్తారు. మంచి ఉంటే మంచి... చెడు ఉంటే చెడు. మేకప్ ఉంటే ఒకలా.. మేకప్ లేకపోతే మరోలా ఉండరు. చిన్నోడు పెద్దోడు అని తేడా చూడరు. సీఎం అయినా.. చిన్నావాళ్లైనా అందిరినీ ఒకేలా గౌరవిస్తారు. అవినీతి అక్రమాలు అనేవి బాలయ్యలో లేవు. అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న బాలయ్యతో పాటు ఆయన అన్నదమ్ములు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. నాన్న రాజకీయాన్ని ఎపుడు పైరవీలకు వాడుకోలేదు. ఎన్టీఆర్ కొడుకులు ఇప్పటికీ అందరు కష్టపడే డబ్బులు సంపాదించుకుంటున్నారు’ అని పోసాని చెప్పుకొచ్చారు. అయితే భేటీకి పిలవకపోవడం.. బాలయ్య చేసిన సంచలన వ్యాఖ్యలపై మాత్రం పోసాని స్పందించలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com