అవి కమ్మ నందులు.. ఏ కాంపౌండ్‌కి ఎన్నో ముందే డిసైడ్, డామినేషన్ ఎవరిదంటే : పోసాని సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
పోసాని కృష్ణ మురళీ.. టాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్. మనసులో ఎలాంటి దాపరికం లేకుండా ఉన్నది వున్నట్లు కుండబద్ధలు కొడుతుంటారు. ఈ క్రమంలో ఎన్నోసార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాజాగా ఆయన నంది అవార్డ్స్‌ను టార్గెట్ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రకటించిన నంది అవార్డ్స్‌ను ఇవ్వాలా..? వద్దా అనే సందిగ్థంలో వున్నట్లు చెప్పారు. సీఎం జగన్‌తో చర్చించి త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని పోసాని తెలిపారు. అయితే అవార్డ్ కమిటీలో వుండే 12 మందిలో 11 మంది కమ్మవారే వుంటే అవి కమ్మ అవార్డులే అవుతాయన్నారు. తనకు కూడా టెంపర్ సినిమాకు నంది అవార్డ్ ప్రకటించారని .. కానీ అది కమ్మ నంది అని తనకు వద్దని పోసాని పేర్కొన్నారు.
నందుల్ని ముందే పంచేసుకుంటారు :
రచయితగా పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, శివయ్య, గాయం వంటి ఎన్నో మంచి సినిమాలకు పనిచేశానని.. కానీ వాటిలో ఏ ఒక్క దానికి తనకు నంది అవార్డ్ రాలేదని ఆయన వాపోయారు. ఇండస్ట్రీలో కులాలు, గ్రూపుల వారీగా నంది అవార్డులను పంచుకుంటున్నారని పోసాని ఆరోపించారు. పరిశ్రమలో కమ్మ, కాపు డామినేషన్ లేదని.. కేవలం క్యాష్ డామినేషన్ మాత్రమే వుందని కృష్ణ మురళీ పేర్కొన్నారు. నంది అవార్డులు ప్రకటించడానికి ముందే ఫలానా కాంపౌండ్‌కి 2, మరో కాంపౌండ్‌కు 3 ఇలా పంచేసుకుంటారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు నంది అవార్డుల గురించి అంబికా కృష్ణను తాను ప్రశ్నించానని పోసాని కృష్ణ మురళీ పేర్కొన్నారు.
పోసానిని ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌ని చేసిన జగన్ :
ఇదిలావుండగా .. పోసాని కృష్ణమురళిని ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా గతేడాది నియమించారు జగన్. వైసీపీ స్థాపించిన నాటి నుంచి సినీ పరిశ్రమ తరపున జగన్‌కు అండగా నిలబడుతున్న వారిలో పోసాని ఒకరు. ఎంతోకాలంగా జగన్మోహన్ రెడ్డికి నమ్మకస్తుడగా వుంటున్న నేపథ్యంలో .. అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లకు పోసానికి ఈ కీలక పదవిని కట్టబెట్టారు సీఎం.
జగన్‌పై ఈగ వాలనివ్వని పోసాని :
సినీ పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా, నటుడిగా సత్తా చాటిన పోసాని కృష్ణమురళీ తొలుత ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత రాజకీయాలకు పూర్తిగా స్వస్తి పలికి సినిమాలతో బిజీ అయ్యారు. అయితే రాజకీయాల్లోకి రానప్పటికీ జగన్‌కు బయటి నుంచి మద్ధతు పలికారు. జగన్‌ను ఎవరైనా ఏమన్నా అంటే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి వారిని ఏకిపారేసేవారు పోసాని. జగన్ ముఖ్యమంత్రి కాగానే ఖచ్చితంగా పదవి వచ్చే వారిలో పోసాని పేరు వుంటుందని అంతా భావించారు. కానీ ఎందుకో లేట్ అయ్యింది. కానీ ఎట్టకేలకు కృష్ణమురళికి పదవిని అప్పగించారు జగన్మోహన్ రెడ్డి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments