చంద్రబాబుపై పోసాని బూతుల వర్షం..!

  • IndiaGlitz, [Saturday,March 09 2019]

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వివాదాస్పద చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఇప్పటికే పలు సంచలనాలు సృష్టించిన ఈ మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ అటు ట్విట్టర్‌లోనే కాకుండా.. టీవీ చానెల్స్‌లో యాడ్స్ ఇవ్వడం కూడా ఆర్జీవీ కొత్తగా చేస్తున్నారు. తాజాగా శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో 'సింహ గర్జన' పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల అన్నగారు ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి కూడా విచ్చేశారు.

నువ్వు నిజాయితీగా ఉండొచ్చుగా..

ఈ కార్యక్రమంలో భాగంగా పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ కాసేపు రాజకీయాల ప్రస్తావన.. ఆర్జీవీ గురించి మాట్లాడారు. ఆర్జీవీ గురించి మాట్లాడిన ఆయన ఆయన్ను ఆకాశానికెత్తేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని సభా వేదికగా అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా లపలు ఆసక్తికర విషయాలు తెలిపారు. సినిమా గురించి మాట్లాడిన ఆయన.. ఈ సినిమాను బయటకు రానివ్వరు... పలానా పార్టీ వారు సినిమాను ఆపేస్తారు. థియేటర్ వద్ద గొడవ చేస్తారు. సెన్సార్ వద్ద ఆపేస్తారు అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ వెధవ వేశాలు వేయడం ఎందుకు? నువ్వు నిజాయితీగా ఉండొచ్చుగా... అని ఓ పార్టీని ఉద్దేశించి పోసాని కౌంటర్ల వర్షం కురిపించారు.

వాళ్లెవరికీ రాలేదే..!?

ఎవరైతే నీతిగా.. నిజాయితీగా ఉండరో, నీతిగా ఉండరో వారికే లేనిపోని సమస్యలు వస్తాయి. దివంగత ప్రధాని వాజ్ పేయికి ఎలాంటి సమస్యలు రాలేదు. అద్వానీకి అస్సలే రాలేదు. చాలా మంది నిజాయితీ పరులైన వారికి రాలేదు. పుచ్చలపల్లి సుందరయ్య రాజకీయాల్లో ఉన్నారు. వారికి ఈ కష్టాలు రాలేదు. ఇలాంటి సమస్యలు వెధవ వేశాలు వేసిన వారికి, అవినీతి పనులు చేసిన వారికి, వెన్నుపోటు పొడిచిన వారికి వస్తాయి. వారే బాధపడుతూ ఉంటారు. నువ్వు ఆ పనులు చేయకపోయి ఉంటే ఆర్జీవీ ఈ రోజు ఈ సినిమా తీయడు కదా. ఏ రామాయణమో, మహాభారతమో తీసేవాడు. నువ్వు వెధవ వేశాలు వేస్తే ఆర్జీవీ తీయడానికి రెడీగా ఉంటాడు. రామూ తప్పు చేసినా తన మీద తనే రామూ సెటైర్ వేసుకుంటాడు. తాను పరిపూర్ణ మానవుడిని, క్రిస్టల్ క్లియర్ అని ఎప్పుడూ చెప్పలేదు. తను తప్పు చేస్తే ఎస్ తప్పు చేశాను అంటాడు అని పోసాని చెప్పుకొచ్చారు.

అంతటితో ఆగని ఆయన.. నువ్వు ప్రజాస్వామ్యంలో ఉండి, ప్రభుత్వంలో ఉండి లంగా పనులు చేస్తుంటే రామూ ఎందుకు వదిలిపెడతాడు? నేనూ రాజకీయాల్లోకి వచ్చినా.. వెధవ పని చేసినా రామూకి నన్ను తిట్టే హక్కు ఉంది. ఎందుకంటే అతడు సిటిజెన్, ఓటర్. సెన్సార్ వారికి కూడా ఈ వేదిక నుంచే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది జరిగిన కథ. మీరు ముక్క ముట్టుకోకుండా బయటకు వస్తే ప్రజలు రియలైజ్ అవుతారు. సినిమా స్పష్టంగా ఉంటుంది. సినిమాలో ఎవరైనా నీతి మంతుడు ఉంటే వారికి ఓట్లు పడతాయి. ఎవరైతే వెధవ వేశాలు వేశాడు అని జనం అభిప్రాయ పడితే వాడు తప్పకుండా నాశనం అయిపోతాడు అని పరోక్షంగా కౌంటర్ల వర్షం కురిపించారు.

ఈ వ్యవహారం మొత్తమ్మీద.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు గురించే పోసాని మాట్లాడరని స్పష్టంగా అర్థం చేస్కోవచ్చు. అయితే ఆయన ఒక్క పేరు మాత్రం బయటపెట్టకుండా చెప్పాల్సింది చెప్పేసి.. తిట్టాల్సినవన్ని తిట్టేశారు. అయితే టీడీపీ నేతల నుంచి పోసాని వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

More News

ఆడపడుచుల రక్షణ బాధ్యత జనసేనదే..

ఆడపడుచులకు రక్షణ కల్పించే బాధ్యత జనసేనదేనని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

ఎకరాకు రూ.8 వేలు ఆర్థిక సాయం : పవన్

ప్రతి రైతు కుటుంబానికి ఎక‌రానికి రూ. 8 వేలు ఆర్ధిక సాయాన్ని అందిస్తామ‌ని..

'బాహుబలి' కొడాలిని ఢీ కొట్టనున్న అవినాష్..

హ్యాట్రిక్ ఎమ్మెల్యే.. వైసీపీలో ‘బాహుబలి’గా పేరుగాంచిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఢీ కొనేందుకు టీడీపీ అధిష్టానం అభ్యర్థిని ఫిక్స్ చేసింది.

టీడీపీలోకి కౌశల్.. ఎంపీగా పోటీ..!

టాలీవుడ్ నటుడు, బిగ్‌బాస్ విజేత కౌశల్ సైకిలెక్కేశారా..? ఇక అధికారికంగా పసుపు కండువా కప్పుకోవడమే ఆలస్యమా..? 2019 ఎన్నికల్లో ఆయన ఎంపీగా బరిలోకి దిగనున్నారా..?

నరేశ్ ప్యానెల్‌కు మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్

‘మా’ అసోసియేషన్ ఎన్నికలపై మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన మద్దతు నరేశ్, రాజశేఖర్ ప్యానల్‌కు ఉంటుందని ప్రకటించారు.