సోనూసూద్‌పై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయిన పోసాని..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి కారణంగా ముఖ్యంగా ప్రజానీకానికి ఎవరేంటనేది తెలిసి వచ్చింది. రీల్ లైఫ్ హీరోలు కాస్తా.. రియల్ లైఫ్ జీరోలైతే.. రీల్ లైఫ్ విలన్లు రియల్ లైఫ్ హీరోలుగా వచ్చి మేమున్నామంటూ ప్రజలకు అండగా నిలిచారు. కష్టం వచ్చినప్పుడే సాయం విలువ తెలుస్తుంది... ఎదుటి వ్యక్తి గుణం అర్థమవుతుంది. అలా కష్టంలో సాయం కోరిన ప్రతి ఒక్కరికీ అండగా నిలిచి.. తనో గొప్ప వ్యక్తిగా సోనూసూద్ నిరూపించుకున్నారు. ఈ రీల్ లైఫ్ విలన్‌కి జనం తమ గుండెల్లో ఏకంగా గుడి కట్టేశారు. అంతగా ప్రజల హృదయంలో సోనూ స్థానం సంపాదించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సోనూపై డైరెక్టర్ పోసాని కృష్ణ మురళి తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. సోనూ కంటే బాగా సాయం చేసే వాళ్లు టాలీవుడ్లో ఉన్నారని అయితే వారు పేపర్లలో కనిపించరని పోసాని వ్యాఖ్యానించారు.
సోనూ నిన్నకాక మొన్నొచ్చాడు..
సోనూసూద్ సాయం చేస్తే.. భారతదేశం మొత్తం బాగుపడిపోతుందా? అని పోసాని ప్రశ్నించారు. మనవాళ్లు ఎప్పటి నుంచో సాయం చేస్తున్నారని.. సోనూసూద్ నిన్నకాక మొన్న వచ్చాడన్నారు. అయితే మనవాళ్లు సోనూ లాగా పేపర్లలో కనిపించరని పేర్కొన్నారు. మనవాళ్లు ఏమీ ఇవ్వలేదనడం కరెక్ట్ కాదని పోసాని తెలిపారు. అల్లు అర్జున్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, మహేశ్ బాబు లాంటి వాళ్లు కోట్లల్లో సాయం చేశారని పేర్కొన్నారు. కాకపోతే... మన వాళ్లు అందరిలాగా బిల్డప్ ఇచ్చుకోరని పోసాని తెలిపారు. రూపాయి పెట్టి పెద్ద ప్రెస్‌మీట్ పెట్టి బిల్డప్ ఇచ్చుకుంటారని ఎద్దేవా చేశారు. తాను కూడా ఈ కరోనా టైమ్‌లో తోచినంత సాయం చేశానని... అది తాను చెప్పుకోనన్నారు. కానీ సాయం తీసుకున్న వాళ్లకు మాత్రమే అది తెలుస్తుందని పోసాని తెలిపారు.
సోనూ కంటే బ్రాడ్ మైండ్ ఉన్నవాళ్లున్నారు..
సోనూ అవకాశాలపై సైతం పోసాని కామెంట్ చేశారు. తాను గర్వంగా చెబుతున్నానని.. సోనూసూద్ కంటే వెయ్యి రెట్లు బ్రాడ్ మైండెడ్ ఉన్న హీరోలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మన టాలీవుడ్లో ఉన్నారన్నారు. ఆయనకు ప్రచారం వచ్చినంత మాత్రాన అవకాశాలు రావన్నారు. సోనూసూద్‌కు దేశం మీద ప్రేమ ఉందో.. ప్రజల మీద ఉందో.. లేకుంటే ఇంకేమైనా ఉందో తెలియదన్నారు. ఆయన కంటే ఎక్కువే మన తెలుగు వాళ్లకు కూ దేశంపై, ప్రజలపై ప్రేమ ఉందని పోసాని వ్యాఖ్యానించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments