లైవ్ లో నీయమ్మ... అంటూ ఒకరి పై ఒకరు ఫైర్ అయిన పోసాని, వి.హెచ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళి తన అభిప్రాయం ఏదైనా సరే...ముక్కసూటిగా చెబుతారు. ముక్కుసూటిగా తన అభిప్రాయం చెబుతున్నప్పుడు ఎవరైనా అడ్డుతగిలారో ఇక అంతే...ఆవేశం ఆపుకోలేడు..! ఇటీవల ఓ న్యూస్ ఛానల్ సర్జికల్ స్ట్రెక్స్ గురించి చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత వి.హెచ్, సిపీఐ నారాయణ, పోసాని కృష్ణమురళీ పాల్గొన్నారు. ఈ చర్చా కార్యక్రమంలో పోసాని మాట్లాడుతూ...నేను బి.జె.పి పార్టీలో లేకపోయినా మోదీని అభిమానిస్తాను. ఇండియాలో ఉన్న రాజకీయ నాయకుల్లో మోస్ట్ హానెస్ట్ పర్సన్ మోడీ అని చెప్పాడు. అంతే కాకుండా మోడీని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అతని పై ఒక్క అవినీతి మచ్చ కూడా లేదు అని చెప్పాడు.
దీంతో విహెచ్ మోడీ గురించి మాకు ఎందుకు... చర్చను పక్కదారి పట్టిస్తున్నావ్ అంటూ కోపంగా అన్నారు. దీంతో పోసాని...నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎవరూ కల్పించుకోవద్దు. ఎవరైనా మాట్లాడితే నేను మాట్లాడను. ఎందుకంటే నేను చదువుకున్న వాడిని. మనం కుక్కలం కాదు మనుషులం. అయినా మోడీ అంటే ఇష్టం పొగుడుతాను వద్దు అనడానికి నువ్వు ఎవరు అంటూ విహెచ్ పై ఫైర్ అయ్యారు. దీంతో విహెచ్ ఎవడ్రా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావ్..! మోడీ అంటే అంత ఇష్టం ఉంటే బయట మాట్లాడుకో అని గట్టిగా అరిచారు. అంతే..అప్పుడు పోసాని సహనం కోల్పోయి నీయమ్మ అంటూ బూతులు మొదలెట్టారు. ఇద్దరూ కుర్చీలోంచి లేచి కొట్టుకునేంత పని చేసారు. వెంటనే ఛానల్ సిబ్బంది పోసానికి నచ్చచెప్పి పంపించేసారు. అయితే...పోసాని, వి.హెచ్ ల ఈ వివాదం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments