నన్ను.. చంపడానికి ప్లాన్ చేశారా?: పోసాని
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో టాలీవుడ్ నటుడు, డైరెక్టర్, రచయిత పోసాని మురళీ కృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. "నేను చంద్రబాబును తిడుతూ సినిమా తీయడం లేదు, నేను తీసేది సందేశాత్మక చిత్రం అని క్లియర్గా చెబుతూ లెటర్ రాసినా.... మీరు మళ్లీ నాకు 20వ తారీఖు వచ్చి స్వయంగా ఆ విషయం చెప్పండి అంటున్నారు. నేను ఎందుకు రావాలండీ? నేను సినిమా తీయడం లేదని తెలిసిన తర్వాత... క్లారిఫై చేసిన తర్వాత కూడా మళ్లీ రమ్మంటున్నారు.
నేను వైసీపీ సానుభూతి పరుడిని కాబట్టి పిలుస్తున్నారా? తీసుకెళ్లి ఏం చేస్తారు? సెక్రటేరియట్ దగ్గర ఏమైనా చంపడానికి ప్లాన్ చేశారా? చంద్రబాబుకు ముందు నన్ను చేతులు కట్టుకుని నిలబెట్టి ఇదిగో సార్ ఇతడిని పట్టుకొచ్చామని చెప్పడానికా? ఎందుకు నన్ను పిలుపిస్తున్నారు. నేను వెన్ను పోటుదారుడిని కాదు, రౌడీ షీటర్ కాదు, బ్రోకర్ కాదు, లోఫర్ కాదు, నా మీద ఏ కేసు లేదు, ఏ వెధవ పని చేయలేదు, బ్యాంకులను మోసం చేయలేదు, అవీనితి చేయలేదు, తాగుబోతు, తిరుగుబోతును కాదు... ఏ చరిత్రా లేకుండా ఎవరో చెప్పారని చెప్పి లెటర్ పంపారు. నేను వివరణ ఇస్తూ లెటర్ ఇచ్చిన తర్వాత కూడా నన్ను స్వయంగా రమ్మంటారు... ఇదెక్కడి న్యాయం" అని పోసాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారు?
"నేను దేశానికి ఉపయోగపడే సినిమా తీశాను. ఆ సినిమా పేరు "ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు". ఆ సినిమా పోస్టర్ కూడా విభిన్నంగా ఉంటుంది. నా సినిమా ఏ ఒక్కరి కోసం, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. కేవలం ప్రజల కోసం నేను సినిమా తీశాను. చంద్రబాబును తిట్టాలంటే సినిమా తీయాలా?. పూర్తికానీ సినిమాపై ఎన్నికల అధికారులకు ఎవరో ఫిర్యాదు చేశారు. నేను ఏ సినిమా తీయడం లేదని, తీస్తున్నట్లు ప్రకటన కూడా చేయలేదని... ఎవరో లెటర్ రాస్తే ఎలక్షన్ కమీషన్ నాకు లెటర్ రాసి సంజాయిషీ కోరడం ఏమిటని?.
నేను సినిమా తీయడం లేదని తిరిగి లెటర్ రాసినా మళ్లీ నాకు నోటీసులు పంపడం ఏమిటి..?. గతంలో ఎన్టీ రామారావు మీద 'మండలాధ్యక్షుడు' లాంటి రెండు మూడు సినిమాలు తీశారు. రామారావుగారికి ఈ విషయం చెబితే మేము కూడా ఆ సినిమా చూశామండీ... వారు సేమ్ నాలాగే చేశారు అని హుందాగా తీసుకున్నారు. అది లీడర్ క్యాలిటీ.
చంద్రబాబు కొన్ని తప్పుడు పనులు చేశాడు కాబట్టే అతడిపై సినిమాలు తీస్తున్నారు. చంద్రబాబు మంచోడైతే అయితే ప్రజలు ఆ సినిమాలను నమ్మరు కదా... ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారు" అంటూ పోసాని తనదైన శైలిలో విమర్శించారు. కాగా ఈ విమర్శలపై టీడీపీ నేతలు, ముఖ్యంగా చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout