పోర్చుగల్ షెడ్యూల్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జున మన్మథుడు 2 షూటింగ్ శరవేగంగా.. ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న `మన్మథుడు 2` పోర్చుగల్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఓ నెల రోజుల పాటుగా లిస్బన్, పోర్టొ సిటీస్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ షెడ్యూల్లో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు వెన్నెల కిషోర్ ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
`మన్మథుడు` ఇన్స్పిరేషన్తో, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ ఫన్ రైడర్ తెరకెక్కుతోంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మనం ఎంటర్‌ప్రైజస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments