ఏపీ కొత్త కేబినెట్.. మంత్రులకు శాఖల కేటాయింపు, రోజాకు ఏ శాఖంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
అలకలు, అసంతృప్తులు, ధిక్కార స్వరాలు, రాజీనామాలు , నిరసనలు ఇలా రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంపై కనిపించిన పరిస్థితులు. సీఎం వైఎస్ జగన్ తన కేబినెట్‌ను పునర్వ్యస్ధీకరిస్తుండటమే ఇందుకు కారణం. పార్టీ పెట్టిన నాటి నుంచి జగన్ వెంటే వున్నా నేటికీ మంత్రి పదవి రాకపోవడంతో కొందరు సీనియర్లు.. అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ జగన్ ఇలాంటివి పట్టించుకోకుండా 25 మందితో కూడిన తన కొత్త టీమ్‌ను అనౌన్స్ చేశారు. ఇకపోతే.. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఇవాళ ఉదయం 11.31 నిమిషాలకు అమరావతిలోని సచివాలయం పక్కనున్న ఖాళీ స్థలంలో జరిగింది. కొత్తగా మంత్రివర్గంలో చేరిన 25 మంది చేత రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేశారు. అంతా బాగానే వుంది కానీ ఎవరెవరికీ ఏ శాఖలు కట్టబెట్టారోనన్న ఉత్కంఠ నెలకొంది. దీనికి గంటల వ్యవధిలోనే తెరదించారు జగన్. కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు.
మంత్రులు- శాఖలు
1బొత్స సత్యనారాయణ - విద్యాశాఖ
2. ధర్మాన ప్రసాద రావు - రెవెన్యూ శాఖమంత్రి
3. సిదిరి అప్పల రాజు - మత్స, పశుసంర్ధక
4. గుడివాడ అమరనాథ్ - పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ
5. ముత్యాల నాయుడు - పంచాయతీ రాజు, రూరల్ డెవలప్‌మెంట్
6. దాడిశెట్టి రాజు - రోడ్లు, భవనాలు
7. చెల్లుబోయిన వేణుగోపాల్ - ఐ అండ్ పీఆర్, సినిమాటోగ్రఫీ, బీసీ సంక్షేమం
8. విశ్వరూప్ - ట్రాన్సపోర్టు.
9. తానేటి వనిత - హోమ్ శాఖ
10. కారుమూరి నాగేశ్వర రావు - పౌర సరఫరాలు
11. కొట్టు సత్యనారాయణ - దేవాదాయ శాఖ
12. జోగి రమేష్ - గృహ నిర్మాణం
13. అంబటి రాంబాబు - ఇరిగేషన్ శాఖ
14. విడుదల రజని - వైద్య ఆరోగ్య శాఖ
15. మెరుగు నాగార్జున - సాంఘిక సంక్షేమ శాఖ
16. ఆదిమూలపు సురేష్ - మున్సిపల్ శాఖ
17. కాకాని గోవర్దన్ రెడ్డి - వ్యవసాయం, సహకార మార్కెటింగ్
18. ఉష శ్రీ చరణ్ - మహిళా శిశు సంక్షేమం
19. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - విద్యుత్, ఫారెస్ట్
20. రోజా - టూరిజం, యువజన, సాంస్కృతిక శాఖ
21. నారాయణ స్వామి - ఆబ్కారీ
22. జయరాం - కార్మిక శాఖ
23. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి - ఆర్ధిక శాఖ
24.రాజన్న దొర - ఎస్టీ సంక్షేమం
25.అంజాద్ బాషా - మైనార్టీ సంక్షేమం
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments