కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. హరీశ్‌కు కీలకశాఖ
- IndiaGlitz, [Sunday,September 08 2019]
తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురు మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శాఖలను కేటాయించారు. ప్రమాణ స్వీకారం జరిగిన కేవలం గంట వ్యవధిలోనే కేసీఆర్ శాఖలను కేటాయించడం జరిగింది.
ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారంటే..!
01:- హరీష్ రావు : ఆర్ధికశాఖ
02:- కేటీఆర్ : మున్సిపల్, ఐటి, మైనింగ్, పరిశ్రమల శాఖలు
03:- సబితా ఇంద్రారెడ్డి : విద్యాశాఖ
04:- గంగుల కమలాకర్ : పౌరసరఫరాలు, బీసీ సంక్షేమం
05:- సత్యవతి రాథోడ్ : గిరిజన, మహిళా, శిశుసంక్షేమం
06:- పువ్వాడ అజయ్ కుమార్ : రవాణాశాఖ
టాప్‌లో కరీంనగర్!
ఇదిలా ఉంటే.. కేసీఆర్ తన మంత్రివర్గంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అత్యధిక ప్రాధాన్యాన్ని కల్పించడం జరిగింది. తాజా మంత్రివర్గ విస్తరణకు ముందు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ ఆ జిల్లా నుంచి ప్రాధాన్యం వహించగా..తాజా మంత్రివర్గ విస్తరణలో సిరిసిల్ల నుంచి కేటీఆర్, గంగుల కమలాకర్‌కు చోటు కల్పించారు. దీంతో కరీంనగర్ జిల్లా నుంచి మొత్తం నలుగురు మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేకాదు.. కరీంనగర్ నుంచి కేబినెట్లోకి తీసుకున్న వారికి కీలక శాఖలను కేసీఆర్ కేటాయించడం జరిగింది.