కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. హరీశ్‌కు కీలకశాఖ

  • IndiaGlitz, [Sunday,September 08 2019]

తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురు మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాఖలను కేటాయించారు. ప్రమాణ స్వీకారం జరిగిన కేవలం గంట వ్యవధిలోనే కేసీఆర్ శాఖలను కేటాయించడం జరిగింది.

ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారంటే..!

01:- హరీష్ రావు : ఆర్ధికశాఖ
02:- కేటీఆర్ : మున్సిపల్, ఐటి, మైనింగ్, పరిశ్రమల శాఖలు
03:- సబితా ఇంద్రారెడ్డి : విద్యాశాఖ
04:- గంగుల కమలాకర్ : పౌరసరఫరాలు, బీసీ సంక్షేమం
05:- సత్యవతి రాథోడ్ : గిరిజన, మహిళా, శిశుసంక్షేమం
06:- పువ్వాడ అజయ్ కుమార్ : రవాణాశాఖ

టాప్‌లో కరీంనగర్!

ఇదిలా ఉంటే.. కేసీఆర్ తన మంత్రివర్గంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అత్యధిక ప్రాధాన్యాన్ని కల్పించడం జరిగింది. తాజా మంత్రివర్గ విస్తరణకు ముందు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ ఆ జిల్లా నుంచి ప్రాధాన్యం వహించగా..తాజా మంత్రివర్గ విస్తరణలో సిరిసిల్ల నుంచి కేటీఆర్, గంగుల కమలాకర్‌కు చోటు కల్పించారు. దీంతో కరీంనగర్ జిల్లా నుంచి మొత్తం నలుగురు మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేకాదు.. కరీంనగర్‌ నుంచి కేబినెట్‌లోకి తీసుకున్న వారికి కీలక శాఖలను కేసీఆర్ కేటాయించడం జరిగింది.

More News

RRR అప్డేట్: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే...

ఆ డైరెక్ట‌ర్ బాట‌లో హ‌రీశ్ శంక‌ర్ ట్రావెల్ చేస్తున్నాడా?

షాక్ సినిమాతో డైరెక్ట‌ర్‌గా షాక్ తిన్న హరీశ్ శంక‌ర్ త‌ర్వాత మిర‌ప‌కాయ్ చిత్రంతో పెద్ద హిట్‌ను సొంతం చేసుకున్నాడు. త‌ర్వాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో చేసిన `గ‌బ్బ‌ర్‌సింగ్‌`

'అల‌.. వైకుంఠ‌ట‌పుర‌ములో..' స్టోరీపై క‌థ‌నాలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `అల‌... వైకుంఠ‌పురములో..`. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమాకు లీక్ అంటూ సోష‌ల్ మీడియాలో

కొలువుదీరిన తెలంగాణ కొత్త కేబినెట్

తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది. శనివారం సాయంత్రం రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళ్ శై సౌందరరాజన్ సమక్షంలో నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.

ఇస్రో కీలక ప్రకటన.. ‘విక్రమ్‌’ ల్యాండర్‌ లోకేషన్‌ గుర్తింపు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైన సంగతి తెలిసిందే. చంద్రయాన్-2 విఫలం కావడంతో బెంగళూరులోని