ఎస్వీబీసీలో పోర్న్‌సైట్ కలకలం.. 25 మందిని గుర్తించిన టీటీడీ
Send us your feedback to audioarticles@vaarta.com
తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు మారు పేరు. కొండపైకి మద్యం, మాంసాహారం వంటివన్నీ నిషేధం. అలాంటిది.. ఏకంగా ఒక్కసారిగా పోర్న్ సైట్ లింక్ కలకలం రేపింది. 25 మందికి పైగా ఉద్యోగులు విధులు మానేసి ఇతర వీడియోలు.. పోర్న్‌సైట్స్ చూస్తున్నట్టు గుర్తించి అధికారులు అవాక్కయ్యారు. ఈ వ్యవహారమంతా ఓ భక్తుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. వెంటనే టీటీడీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
అసలు విషయంలోకి వెళితే.. తాజాగా ఓ భక్తుడు తనకు ‘శతమానం భవతి’ కార్యక్రమం కావాలని ఎస్వీబీసీకి ఓ భక్తుడు మెయిల్ చేశాడు. ఆ భక్తుడికి తిరిగి ఎస్వీబీసీ ఉద్యోగులు పోర్న్ సైట్ లింక్ పంపించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భక్తుడు.. వెంటనే టీడీడీ చైర్మన్, ఈవో జవహర్ రెడ్డిలకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన చైర్మన్, ఈవో ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. ఎస్వీబీసీ ఆఫీసులో జరుగుతున్న వ్యవహారాన్ని టీటీడీ విజిలెన్స్, సైబర్ క్రైం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్, సైబర్ క్రైం అధికారులు ఎస్వీబీసీ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. పోర్న్ సైట్లు చూస్తున్న ఐదుగురు ఉద్యోగుల్ని గుర్తించారు. అలాగే విధులు నిర్వహించకుండా ఇతర వీడియోలు చూస్తున్న..మరో 25 మంది సిబ్బందిని అధికారులు గుర్తించారు. దీంతో ఎస్వీబీసీ అధికారులు ఉద్యోగులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. విషయం బహిర్గతమవుతుండటంతో తిరుమల పవిత్రతను దెబ్బ తీస్తున్నారంటూ భక్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments