ఏప్రిల్ నుంచి జనాభా లెక్కలు..  అపోహలు అక్కర్లేదు!

  • IndiaGlitz, [Tuesday,December 24 2019]

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మంగళవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సుమారు నాలుగు గంటలపాటు జరిగిన ఈ కేబినెట్ భేటీలో పలు విషయాలపై నిశితంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. భేటీ అనంతరం కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడి కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.

ఏప్రిల్ నుంచి జనాభా లెక్కలు!
‘ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జనాభా లెక్కలు జరగనున్నాయి. యాప్ సాయంతోనే జనాభా లెక్కలు జరుగుతాయి. ఇందుకోసం రూ.8,500 కోట్లు కేటాయించింది. ఈ ఎన్‌పీఆర్‌ను 2021 సెన్సస్‌తో అప్ డేట్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ అప్డేషన్ ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించింది. ఈ అప్డేషన్‌ను పేపర్ లెస్‌గా నిర్వహించాలని భావిస్తున్నాం. యాప్ ద్వారా చేయడం వల్ల లక్ష్యిత ప్రజలకు ఉద్దేశించిన పథకాలు ఎంతమందికి అందుతున్నాయన్న వివరాలు తెలుస్తాయి. ఇందుకు గాను ప్రజలు ఎటువంటి పత్రాలూ చూపించాల్సిన అవసరం లేదు. బయోమెట్రిక్, సెల్ఫ్ డిక్లరేషన్ ప్రక్రియతో జనాభా లెక్కల ప్రక్రియ సాగుతుంది’ అని జవదేకర్ వెల్లడించారు.

అపోహలు అక్కర్లేదు!

‘ఎన్పీఆర్ పై అపోహలు వద్దు. మామూలుగా ప్రతీ పదేళ్లకోసారి జనాభా గణన ప్రక్రియను చేపడతాం.. గతంలో యూపీఏ సర్కారు ఎన్పీఆర్‌ను 2010లో ప్రారంభించింది. 2020లో మేం దాన్ని అప్ డేషన్ చేస్తున్నాం. దీనికి ఎన్నార్సీతో సంబంధం లేదు. ఎన్పీఆర్ జనాభా నమోదుకు సంబంధించింది. ఎన్నార్సీ పౌరుల నమోదుకు సంబంధించింది. జనాభా లెక్కలకు(సెన్సస్), ఎన్పీఆర్‌కు మధ్య స్వల్ప తేడా ఉంది. 2010లో ప్రారంభమైన ఎన్పీఆర్ 2020లో పూర్తవుతుంది. సెన్సస్(జనాభా లెక్కలు) 2021లో జరుగుతాయి. వీటిని ఇంటింటికి వెళ్లి చేస్తారు’ అని కేంద్ర మంత్రి తెలిపారు. కాగా.. పైన చెప్పబడిన నిర్ణయాలతో పాటు.. అటల్ జల్ యోజన, చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్టు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది.

More News

నిర్మాత డేట్‌కు రమ్మన్నాడు.. కుదరని చెప్పడంతో.!

‘మీ టూ’ ఉద్యమం సినీ రంగంలో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపులపై పెద్ద ఎత్తున చర్చ జరిగి..

'మత్తువదలరా' కు నేపథ్య సంగీతాన్ని అందించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది! - కాలభైరవ

ఇండస్ట్రీలో తొలి అవకాశం రావడం గొప్ప అన్నది నా సిద్ధాంతం. పెద్ద కుటుంబం నుంచి వచ్చినా ఆ నియమం నాకు వర్తిస్తుంది అన్నారు కాలభైరవ.

'బ్యూటిఫుల్ ' ప్రీ రిలీజ్

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై టి. అంజయ్య స‌మ‌ర్ప‌ణ‌లో నైనా గంగూలి, సూరి హీరోహీరోయిన్లుగా

ప్రతి అమ్మాయి నా పాత్ర తో రిలేట్ అవుతుంది. హీరోయిన్  కారుణ్య కత్రేన్

శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్ ఆర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉత్తర’.

'జార్జ్ రెడ్డి' చిత్రానికి బెస్ట్ అప్రిసియేషన్ అవార్డు

ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికీ రోల్ మోడల్ గా పేర్కొనే స్టూడెంట్ లీడర్ "జార్జ్ రెడ్డి" జీవితం ఆధారంగా సందీప్ మాధవ్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన "జార్జ్ రెడ్డి"