ఒకే హీరో..ఒకే పాట రెండు సార్లు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకే హీరో..ఒకే పాట రెండు సార్లు...వినడానికి...చదవడానికి కొత్తగా ఉన్నా...ఇది నిజంగా నిజం. కాకపోతే ఒకసారి చేసిన పాటనే లిరిక్స్ మార్చి అదే ట్యూన్ తో మరోసారి అందించారు. ఇంతకీ అది ఏ పాట...అనుకుంటున్నారా..? విలక్షణ నటుడు మోహన్ బాబు తప్పు చేసి పప్పు కూడు అనే సినిమా చేసారు. ఈ చిత్రంలో మెహన్ బాబు, శ్రీకాంత్, గ్రేసీ సింగ్ నటించారు. ఈ మూవీలో అంతన్నాడ్..ఇంతన్నాడే..గంగరాజు..అనే పాట బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఇదే పాటను లిరిక్స్ మార్చి అదే ట్యూన్ తో మామ మంచు అల్లుడు కంచు మూవీలో పెట్టారు.
ఇందులో ఇరగేస్తాడు..తిరగేస్తాడు..కుమ్మేస్తాడు..దంచేస్తాడు..బాలరాజు అనే పాట పెట్టారు. కాకపోతే ఈ పాటను అల్లరి నరేష్ పై చిత్రీకరించారు. తప్పు చేసి పప్పు కూడు సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించగా మామ మంచు అల్లుడు కంచు చిత్రానికి అచ్చు,కోటి, రఘు కుంచె సంగీతాన్ని అందించారు. మరి..ఈ పాట ఆ పాటలా పాపులర్ అవుతుందో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com