ఒకే హీరో..ఒకే పాట రెండు సార్లు..

  • IndiaGlitz, [Monday,November 30 2015]

ఒకే హీరో..ఒకే పాట రెండు సార్లు...విన‌డానికి...చ‌ద‌వ‌డానికి కొత్త‌గా ఉన్నా...ఇది నిజంగా నిజం. కాక‌పోతే ఒక‌సారి చేసిన పాట‌నే లిరిక్స్ మార్చి అదే ట్యూన్ తో మ‌రోసారి అందించారు. ఇంత‌కీ అది ఏ పాట‌...అనుకుంటున్నారా..? విలక్ష‌ణ న‌టుడు మోహ‌న్ బాబు త‌ప్పు చేసి ప‌ప్పు కూడు అనే సినిమా చేసారు. ఈ చిత్రంలో మెహ‌న్ బాబు, శ్రీకాంత్, గ్రేసీ సింగ్ న‌టించారు. ఈ మూవీలో అంత‌న్నాడ్..ఇంత‌న్నాడే..గంగ‌రాజు..అనే పాట బాగా పాపుల‌ర్ అయ్యింది. ఇప్పుడు ఇదే పాట‌ను లిరిక్స్ మార్చి అదే ట్యూన్ తో మామ మంచు అల్లుడు కంచు మూవీలో పెట్టారు.

ఇందులో ఇర‌గేస్తాడు..తిర‌గేస్తాడు..కుమ్మేస్తాడు..దంచేస్తాడు..బాల‌రాజు అనే పాట పెట్టారు. కాక‌పోతే ఈ పాటను అల్ల‌రి న‌రేష్ పై చిత్రీక‌రించారు. త‌ప్పు చేసి ప‌ప్పు కూడు సినిమాకి కీర‌వాణి సంగీతాన్ని అందించ‌గా మామ మంచు అల్లుడు కంచు చిత్రానికి అచ్చు,కోటి, ర‌ఘు కుంచె సంగీతాన్ని అందించారు. మ‌రి..ఈ పాట ఆ పాట‌లా పాపుల‌ర్ అవుతుందో లేదో చూడాలి.

More News

త్రిష కోరిక తీరుతుందా..

తెలుగు,తమిళ,కన్నడ..ఇలా సౌత్ మూవీస్ లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది నిషా కళ్ళ త్రిష.

రీమేక్ కాదు.. డ‌బ్బింగే

త‌మిళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం 'వేదాళం'. అజిత్, శ్రుతి హాస‌న్ జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి 'శౌర్యం' శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

సూర్య కొత్త సినిమాకి పాజిటివ్ వైబ్రేషన్స్

అపజయమెరుగని కాంబినేషన్ ల్లో కథానాయకుడు సూర్య,దర్శకుడు హరి కాంబినేషన్ ఒకటి.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నాలుగు చిత్రాలు సక్సెస్ అయ్యాయి.

రామ్ చ‌ర‌ణ్ టైటిల్‌తో వ‌స్తున్న విజ‌య్‌

2010లో రామ్‌చ‌ర‌ణ్ హీరోగా మొద‌లైన చిత్రం 'మెరుపు'. ధ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వంలో కాజ‌ల్ హీరోయిన్‌గా ప‌ట్టాలెక్కిన ఈ సినిమా..

చరణ్ ఫోకస్ అలాంటి టైటిలేపైనేనట

రామ్ చరణ్ ఇప్పటివరకు 9 చిత్రాల్లో కథానాయకుడిగా నటించాడు.10వ చిత్రంగా తమిళ బ్లాక్ బస్టర్'తని ఒరువన్ 'ని రీమేక్ చేయనున్నాడు.