Gaddar:ప్రజా గాయకుడు గద్ధర్ కన్నుమూత : ఆట, పాటతో బడుగులకై పోరాడి.. దీవికేగిన ప్రజా యుద్ధ నౌక

  • IndiaGlitz, [Sunday,August 06 2023]

ప్రజాగాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూశారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకున్నారు గద్ధర్. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గద్ధర్ మరణించినట్లుగా ఆయన కుమారుడు సూర్యం వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గద్ధర్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులు పరామర్శించి ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. కోలుకుని తిరిగి వస్తారు అనుకుంటే గద్ధర్ తిరిగిరాని

గద్ధర్ పూర్తి పేరు గుమ్మడి విఠల్ రావు. 1948లో తూప్రాన్‌లో ఆయన జన్మించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్ లెనినిస్ట్), పీపుల్స్ వార్ గ్రూప్‌కు మద్ధతుదారుగా వున్నారు. 1997లో గద్ధర్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ క్రమంలో ఆయన వెన్నెముకలో ఓ బుల్లెట్ వుండిపోయింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్ధర్ .. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడారు. తన ఆటపాటలతో ఉద్యమానికి ఊపుతెచ్చారు. 1987లో ప్రకాశం జిల్లా కారంచేడులో దళితులపై జరిగిన హత్యాకాండపై పోరాటం చేశారు.

More News

Ileana D'Cruz : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పిల్లాడి పేరేంటో తెలుసా..?

గోవా బ్యూటి ఇలియానా తల్లి అయ్యారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా స్వయంగా ప్రకటించారు.

Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ 'డెవిల్ ' రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే..?

ఇప్పుడంటే హీరోలంతా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుని సినిమాలు చేస్తున్నారు కానీ.. ఈ విషయంలో అందరికంటే ముందే వున్నారు

TTD : విధేయతకు పట్టం.. టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ ఛైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు.

Prem Kumar:ఆగ‌స్ట్ 18న వ‌స్తోన్న 'ప్రేమ్ కుమార్' సినిమా ఆడియెన్స్‌ని మ‌న‌స్ఫూర్తిగా న‌వ్విస్తుంది: సంతోష్ శోభ‌న్‌

కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫ‌రెంట్ మూవీస్‌తో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో సంతోష్ శోభ‌న్ తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’.

Chandramukhi 2:'చంద్రముఖి 2'.. కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ చిత్రం ‘చంద్రముఖి 2’. స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తున్నారు.