Gaddar:ప్రజా గాయకుడు గద్ధర్ కన్నుమూత : ఆట, పాటతో బడుగులకై పోరాడి.. దీవికేగిన ప్రజా యుద్ధ నౌక

  • IndiaGlitz, [Sunday,August 06 2023]

ప్రజాగాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూశారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకున్నారు గద్ధర్. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గద్ధర్ మరణించినట్లుగా ఆయన కుమారుడు సూర్యం వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గద్ధర్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులు పరామర్శించి ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. కోలుకుని తిరిగి వస్తారు అనుకుంటే గద్ధర్ తిరిగిరాని

గద్ధర్ పూర్తి పేరు గుమ్మడి విఠల్ రావు. 1948లో తూప్రాన్‌లో ఆయన జన్మించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్ లెనినిస్ట్), పీపుల్స్ వార్ గ్రూప్‌కు మద్ధతుదారుగా వున్నారు. 1997లో గద్ధర్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ క్రమంలో ఆయన వెన్నెముకలో ఓ బుల్లెట్ వుండిపోయింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్ధర్ .. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడారు. తన ఆటపాటలతో ఉద్యమానికి ఊపుతెచ్చారు. 1987లో ప్రకాశం జిల్లా కారంచేడులో దళితులపై జరిగిన హత్యాకాండపై పోరాటం చేశారు.