కమల్ సాంగ్ నారా రోహిత్ టైటిల్
Send us your feedback to audioarticles@vaarta.com
నారా రోహిత్ వరుసగా ఓ అరడజను సినిమాలు చేస్తూ...ఫుల్ బిజీగా ఉన్నారు. నారా రోహిత్ హీరోగా నూతన దర్శకుడు ప్రదీప్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతుంది.
ఇదిలా ఉంటే కమల్ హాసన్ నటించిన విచిత్ర సోదరులు సినిమాలోని రాజా చేయి వేస్తే..సాంగ్ లిరిక్ నే నారా రోహిత్ మూవీకి టైటిల్ గా ఫిక్స్ చేసినట్టు సమాచారం. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతన్న ఈ మూవీలో నారా రోహిత్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందట. త్వరలోనే ఈ మూవీ టైటిల్ ఎనౌన్స్ చేయనున్నారు. రాజా చేయి వేస్తే...సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. మరి..రాజా చేయి వేస్తే...టైటిల్ తో వస్తున్న నారా రోహిత్ ఏరేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com