టాలీవుడ్‌లో మరో విషాదం : దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు కన్నుమూత

  • IndiaGlitz, [Saturday,November 27 2021]

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌ నాగేశ్వరరావు హఠాన్మరణం చెందారు. నిన్న తన స్వగ్రామం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఆయనకు హఠాత్తుగా ఫిట్స్‌ వచ్చాయి. దీంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ‍్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలిపారు. నాగేశ్వరరావు భౌతికకాయాన్ని ప్రస్తుతం ఆయన అత్తగారి ఊరైనా నల్లజర్ల దగ్గరలోని కౌలురు గ్రామంలో ఉంచారు. అక్కడే కెఎస్‌ నాగేశ్వరరావు అంత్యక్రియలు జరగనున్నాయి.

'రిక్షా రుద్రయ్య'తో ఆయన టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అనంతరం ఆయన రియల్‌ స్టార్‌ శ్రీహరిని 'పోలీస్‌' సినిమాతో హీరోగా పరిచయం చేశారు. ఆ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. తర్వాత సాంబయ్య, శ్రైశైలం, దేశద్రోహి, శివన్న, వైజయంతి వంటి చిత్రాలు తెరకెక్కించారు నాగేశ్వరరావు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె వున్నారు.

కోడి రామకృష్ణ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన నాగేశ్వరరావు తలంబ్రాలు సినిమా నుంచి ఆయన వద్ద పనిచేస్తున్నారు. ఇటీవల తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ చదలవాడ శ్రీనివాసరావు నిర్మాతగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఇది ఇంకా సెట్స్ మీదే వుంది. అంతలోనే ఈ ఘోరం జరగడంతో సినీ ప్రముఖులు , సన్నిహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

More News

సినిమా టికెట్ల వివాదం.. వైరలవుతున్న త్రివిక్రమ్ ట్వీట్, జగన్ దృష్టికి తీసుకెళ్తానన్న మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల విక్రయం పెద్ద దుమారం రేపోతోంది. అప్పుడే జగన్ ఈ నిర్ణయాన్ని అమలు చేయరని భావించిన సినీ ప్రపంచానికి ఆయన షాకిచ్చారు.

‘83’ టీజ‌ర్ విడుద‌ల‌

భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో 1983 సంవ‌త్స‌రం భార‌త క్రికెట్ జ‌ట్టు విశ్వ విజేత‌గా ఆవిర్భ‌వించిన సంగ‌తి తెలిసిందే.

శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి మూడు లక్షల సాయం

ఆపద అంటూ వస్తే నేనున్నానంటూ అభయమిచ్చే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.

చావు బతుకుల్లో శివశంకర్ మాస్టర్: మీకంటే ధనుష్, సోనూసూద్‌లే నయం..  తెలుగు స్టార్స్‌పై నెటిజన్ల ఫైర్

అప్పుడప్పుడు మన తెలుగు సినీ పరిశ్రమ విచిత్రంగా ప్రవర్తిస్తూ వుంటుంది. ప్రకృతి విపత్తులు,

కెరీర్‌లోనే బిగ్గెస్ట్ స్టెప్ .. హాలీవుడ్‌లోకి సమంత..!!

జీవితంలో ఒడిదొడుకులు సహజమే. విజయానికి సంబరపడకుండా.. కష్టానికి కృంగిపోకుండా నిలబడేవాడే జీవితాన్ని గెలుస్తాడు.