ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత.. విషాదంలో చిత్ర పరిశ్రమ

  • IndiaGlitz, [Thursday,November 11 2021]

భారతీయ చిత్ర పరిశ్రమను వరుస మరణాలు వెంటాడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం నుంచి ఇంకా అభిమానులు కోలుకోలేదు. తాజాగా మరో సినీ ప్రముఖుడు కాలం చేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ కూల్‌ జయంత్‌ (44) బుధవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. డాన్సర్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన తన కృషి, పట్టుదలతో నృత్య దర్శకుడి స్థాయికి ఎదిగారు. దిగ్గజ డ్యాన్స్ మాస్టర్లు ప్రభుదేవా, రాజు సుందరం వద్ద డాన్సర్‌గా పని చేసిన కూల్‌ జయంత్‌ తన కెరీర్‌లో దాదాపు 800 చిత్రాలకు పైగా డాన్సర్‌గా పని చేశారు. అనంతరం ‘‘ కాదల్‌ దేశం ’’ చిత్రం ద్వారా నృత్య దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు.

తమిళ, మలయాళ భాషల్లో 100కు పైగా చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా సేవలందించారు. మలయాళ అగ్ర హీరోలు మమ్ముట్టి, మోహన్‌లాల్‌ వంటి వారి చిత్రాలకు కూల్‌ జయంత్‌ నృత్య దర్శకత్వం వహించారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న జయంత్ బుధవారం వెస్ట్‌ మాంబళంలోని తన నివాసంలో కన్నుమూశారు. కూల్ జయంత్ మృతిపై తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. నిన్న సాయంత్రం చెన్నైలోనే ఆయన అంత్యక్రియలు జరిగాయి.

More News

ప్రారంభమైన మెగాస్టార్ 'భోళా శంక‌ర్ '.. 15 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్, క్యాస్ట్ అండ్ క్రూ ఇదే

మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల జోరు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆచార్యను పూర్తి చేసిన ఆయన.. భోళా శంకర్,

'పుష్పక విమానం' చిత్రంలో పెళ్లి గురించి ఓ మంచి విషయం చెబుతున్నాం - హీరో ఆనంద్ దేవరకొండ

"దొరసాని", "మిడిల్ క్లాస్ మెలొడీస్" చిత్రాలతో టాలెంటెడ్ హీరోగా అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ.

బిగ్ బాస్ 5 తెలుగు : శ్రీరామ్‌కు సోనూసూద్ సపోర్ట్… టైటిల్ గెలిచినట్లేనా ?

బుల్లితెర‌పై ప్రసారమవుతున్న ప్రముఖ రియాలిటీ షో “బిగ్ బాస్ తెలుగు 5” ఆసక్తికరంగా కొనసాగుతోంది.

రిలేషన్ గురించి వెంకటేశ్‌ పోస్ట్‌.. సమంతా- నాగచైతన్య గురించేనా..?

టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత - నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోయిన ఘటనను తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు వారి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఒడిశాకు ఏపీ సీఎం.. జగన్‌పై అభిమానం చాటుకున్న తెలుగువారు, భువనేశ్వర్‌ నిండా ఫ్లెక్సీలే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఒడిశాలోని తెలుగువారు అభిమానం చాటుకున్నారు.