Nassar:తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు నాజర్ తండ్రి కన్నుమూత

  • IndiaGlitz, [Tuesday,October 10 2023]

తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. తమిళ సీనియర్ నటుడు నాజర్ తండ్రి మెహబూబ్ బాషా(95) తుది శ్వాస విడిచారు. వయో భారం కారణంగా కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తమిళనాడు చెంగల్పట్టులోని నివాసంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని నాజర్ కుటుంబసభ్యులు తెలియజేశారు. పితృవియోగంతో బాధపడుతున్న నాజర్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తు్న్నారు. ఇక మెహబూబ్ బాషా అంత్యక్రియలు రేపు(బుధవారం) జరపనున్నారు. నాజర్ తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం. ఆయన ఎన్నో తెలుగు సినిమాల్లో విలన్‌, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించారు. ముఖ్యంగా అతడు సినిమాతో పాటు బాహుబలిలో నాజర్ పోషించిన పాత్రలు ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోయాయి.

దిల్ రాజును ఓదార్చిన చిరంజీవి, రామ్‌ చరణ్‌

ఇటు తెలుగు ఇండస్ట్రీలోనూ విషాదం నెలకొంది. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి(86) తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి కన్నుమూశారు. తండ్రి మరణంతో దిల్ రాజు కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పితృవియోగంతో బాధపడుతున్న ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్ శ్యాంసుందర్ రెడ్డికి నివాళులు దిల్ రాజుని ఓదార్చారు. కుటుంబసభ్యుల సమక్షంలో తండ్రి అంత్యక్రియలు దిల్ రాజు నిర్వహించారు. అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు తండ్రి మరణం తలుచుకుని దిల్ రాజు కన్నీటి పర్యంతమయ్యారు.

దిల్ రాజుగా మారిన వెంకట రమణారెడ్డి..

శ్యాంసుందర్ రెడ్డి దంపతులకు ముగ్గురు సంతానం. వీరు దిల్‌రాజు(వెంకట రమణారెడ్డి) , విజయ్ సింహారెడ్డి , నరసింహారెడ్డి. ఈ కుటుంబం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందినది. చిన్నప్పటి నుంచి వెంకట రమణారెడ్డిని రాజు అని పిలుస్తూ వుండటంతో ఆయన పేరు రాజుగా మారింది. ఆ తర్వాత దిల్‌ సినిమా ఘన విజయం సాధించడంతో అప్పటి నుంచి దిల్‌రాజుగా మారింది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా తెలుగు సినిమాను శాసించగల అతికొద్ది మందిలో ఒకరిగా దిల్‌రాజు నిలిచారు.

More News

YS Jagan: చంద్రబాబు అరెస్టుపై జగన్ వ్యాఖ్యలు వ్యూహమా..? బీజేపీని ఇరికించే ప్రయత్నమా..?

విజయవాడలో సోమవారం జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అంశంపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

Telangana Congress: కాంగ్రెస్ ఈసారైనా అధికారంలోకి వస్తుందా..? కేసీఆర్‌ను ఢీ కొడుతుందా..?

రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు పెంచింది. త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. ఇప్పటికే ఆరు గ్యారంటీ హామీలతో జోష్ మీదున్న

BRS: బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందా..? సెంచరీ కొడుతుందా..?

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహరచనలతో దూసుకుపోతున్నాయి.

YS Jagan: సత్ఫలితాలను ఇస్తున్న జగనన్న విద్యా సంస్కరణలు.. ఇది బాధ్యతాయుతమైన పాలన అంటే..

గ్రామంలోని స్కూలుకు వెళ్లి చదువుకోడం, ఇంటికి వెళ్లడం ఇదే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల పరిస్థితి. కనీసం పట్టణం వెళ్లడమే ఎంతో కష్టం అనుకునే

Chandrababu: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు తదుపరి వాదనలు వింటామని