Daniel:కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ హఠాన్మరణం..

  • IndiaGlitz, [Saturday,March 30 2024]

తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ(48) హఠాన్మరణం చెందారు. ఛాతీలో నొప్పిగా ఉండటంతో శుక్రవారం అర్థరాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే మార్గమధ్యలోనే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆయన మృతి పట్ల తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. చనిపోతూ కూడా డేనియల్ మంచి మనసు చాటుకున్నారు.

తన రెండు కళ్లు దానం చేశారు. మరణానికి ముందు తన కళ్ళను దానం చేయాలని డేనియల్ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఐ రిజిస్టర్‌లో తన పేరు నమోదు చేసుకున్నారు. కుటుంబ సభ్యుల అనుమతి పత్రం కూడా పొందారు. దీంతో వైద్యులు ఆయన కళ్లను ఆపరేషన్ చేసి భద్రపరిచారు. దీంతో డేనియల్ గొప్ప హృదయాన్ని పలువురు కొనియాడుతున్నారు.

డేనియల్ తండ్రి చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగు వ్యక్తి కాగా, తల్లి తమిళనాడుకు చెందిన వారు. ప్రొడక్షన్ మేనేజర్‌గా సినీ కెరీర్ ప్రారంభించిన ఆయన పలు సీరియల్స్‌లో నటించాడు. 2002లో విడుదలైన 'ఏప్రిల్ మదతి' అనే తమిళ చిత్రంతో వెండితెర మీద అరంగేట్రం చేశాడు. అనంతరం దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'కాక్క కాక్క' చిత్రంలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'వెట్టైయాడు వెలైయాడు' మూవీలో సైకో కిల్లర్‌గా అద్భుత నటన కనబరిచాడు. రాఘవన్‌గా తెలుగులో ఈ చిత్రం విడుదలైంది. ఇక తెలుగులోనూ ఆయన కొన్ని సినిమాల్లో నటించాడు.

తెలుగులో ఆయన మొదటి చిత్రం సాంబ. తర్వాత ఘర్షణ, చిరుత, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాల్లోనూ కీలక రోల్స్ చేశాడు. చివరిగా నాని నటించిన 'టక్ జగదీశ్' చిత్రంలో కనిపించాడు. మొత్తంగా తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో 50కి పైగా చిత్రాల్లో ఆయన నటించాడు.

More News

Tillu Square:బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న 'టిల్లు'గాడు.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే..?

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్' బ్లాక్‌బాస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది.

CM Revanth Reddy:కేటీఆర్‌ చిప్పకూడు తింటాడు.. ఫోన్‌ ట్యాపింగ్‌పై సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth) Reddy) స్పందించారు.

Allu Arjun:బన్నీ మైనపు విగ్రహం ఆవిష్కరణ.. తగ్గేదేలే.. సేమ్ టు సేమ్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Kadiyam vs Rajaiah: కడియంకు చెక్‌ పెట్టేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. ఎంపీగా రాజయ్య పోటీ!

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ కీలక నేతలంతా వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు.

Pawan Kalyan:పిఠాపురం కేంద్రంగా పవన్ కల్యాణ్‌ ప్రచారం.. తొలి విడత షెడ్యూల్ విడుదల..

ఏపీలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు చేస్తుండగా..