Daniel:కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ హఠాన్మరణం..
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ(48) హఠాన్మరణం చెందారు. ఛాతీలో నొప్పిగా ఉండటంతో శుక్రవారం అర్థరాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే మార్గమధ్యలోనే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆయన మృతి పట్ల తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. చనిపోతూ కూడా డేనియల్ మంచి మనసు చాటుకున్నారు.
తన రెండు కళ్లు దానం చేశారు. మరణానికి ముందు తన కళ్ళను దానం చేయాలని డేనియల్ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఐ రిజిస్టర్లో తన పేరు నమోదు చేసుకున్నారు. కుటుంబ సభ్యుల అనుమతి పత్రం కూడా పొందారు. దీంతో వైద్యులు ఆయన కళ్లను ఆపరేషన్ చేసి భద్రపరిచారు. దీంతో డేనియల్ గొప్ప హృదయాన్ని పలువురు కొనియాడుతున్నారు.
డేనియల్ తండ్రి చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగు వ్యక్తి కాగా, తల్లి తమిళనాడుకు చెందిన వారు. ప్రొడక్షన్ మేనేజర్‌గా సినీ కెరీర్ ప్రారంభించిన ఆయన పలు సీరియల్స్‌లో నటించాడు. 2002లో విడుదలైన 'ఏప్రిల్ మదతి' అనే తమిళ చిత్రంతో వెండితెర మీద అరంగేట్రం చేశాడు. అనంతరం దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'కాక్క కాక్క' చిత్రంలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'వెట్టైయాడు వెలైయాడు' మూవీలో సైకో కిల్లర్‌గా అద్భుత నటన కనబరిచాడు. రాఘవన్గా తెలుగులో ఈ చిత్రం విడుదలైంది. ఇక తెలుగులోనూ ఆయన కొన్ని సినిమాల్లో నటించాడు.
తెలుగులో ఆయన మొదటి చిత్రం సాంబ. తర్వాత ఘర్షణ, చిరుత, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాల్లోనూ కీలక రోల్స్ చేశాడు. చివరిగా నాని నటించిన 'టక్ జగదీశ్' చిత్రంలో కనిపించాడు. మొత్తంగా తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో 50కి పైగా చిత్రాల్లో ఆయన నటించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout