Popcorn:‘పాప్ కార్న్’ సెన్సార్ పూర్తి.. ఫిబ్రవరి 10న రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్.చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై భోగేంద్ర గుప్తా (నెపోలియన్, మా ఊరి పొలిమేర చిత్రాల నిర్మాత) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్ అవికా గోర్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించటం విశేషం. మురళి గంధం దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 10న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
పాప్ కార్న్ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సినిమా ఆద్యంతం వినోదభరితంగా ఉందని సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే.
నాగ చైతన్య చేతులు మీదుగా రిలీజ్ చేయించిన మది విహంగమాయే పాట శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఫిబ్రవరి 10న ఈ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ఎం.ఎస్.చలపతి రాజు మాట్లాడుతూ ‘‘పాప్ కార్న్’ మూవీని ఫిబ్రవరి 10న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులకు ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారని, అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న సినిమాని ప్రశంసించారు’ అని అన్నారు.
సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన అవికా గోర్ మాట్లాడుతూ .. ‘ఇది ఒక డిఫరెంట్ మూవీ అని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. కొత్త కాన్సెప్ట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఫిబ్రవరి 10న పాప్ కార్న్‌తో సందడి చేయబోతున్నాం’ అని అన్నారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ ‘సెన్సార్ సభ్యులకు సినిమా నచ్చింది. థియేటర్లో ఉన్న ఆడియెన్స్‌కు చివరి 45 నిమిషాలైతే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఉంటుంద’ని అన్నారు.
‘పాప్ కార్న్’ మూవీ పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నాయి.
నటీనటులు: అవికా గోర్, సాయి రోనక్ తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments