హీరోయిన్ గా హిట్స్ లేవు కానీ..
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రియ, అసిన్ వంటి పాపులర్ హీరోయిన్ల ఫీచర్స్‌తో కనిపించే పూర్ణ.. తెలుగులో చెప్పుకోదగ్గ విజయాలనే మూటగట్టుకుంది. 'సీమ టపాకాయ్' ఆమెకి తెలుగులో తొలి బ్రేక్ ఇస్తే.. 'అవును' సినిమా నటిగా ఆమె సత్తాని తెలియజేసింది. ఈ రెండూ కూడా హిట్ లిస్ట్‌లో చేరాయి. అయితే ఆ తరువాతే పూర్ణకి కష్టకాలం మొదలైంది.
'లడ్డుబాబు', 'అవును 2'.. ఇలా పూర్ణ నుంచి వచ్చిన సినిమాలేవీ సక్సెస్ కాలేదు. అయితే.. కొంతలో కొంత ఊరటగా మాత్రం.. ఓ పాటలో మెరిసిన 'శ్రీమంతుడు' .. చిన్న పాత్రలో సందడి చేసిన 'రాజు గారి గది' హిట్స్ అయ్యాయి. దాంతో హిట్ చిత్రాల్లో తాను ఓ భాగమయినట్లయ్యింది పూర్ణకి. మొత్తానికి హీరోయిన్‌గా హిట్స్ లేవు కానీ.. ఇలా అతిథి వేషాలతో హిట్స్‌ని సొంతం చేసుకుంటూ వార్తల్లో నిలుస్తోంది పూర్ణ. హీరోయిన్‌గా పూర్ణకి మంచి రోజులు మళ్లీ ఎప్పుడు వస్తాయో?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments