నరేష్ సినిమాలో పూర్ణ.. అయితే..?
Send us your feedback to audioarticles@vaarta.com
సీమ టపాకాయ్ అనే సినిమాలో అల్లరి నరేశ్, పూర్ణ జతగా నటించారు. ఇప్పుడు మరోసారి అల్లరి నరేశ్ సినిమాలో పూర్ణ నటించనుంది. అయితే ఈసారి హీరోయిన్‌గా పూర్ణ నటించడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
వివరాల్లోకెళ్తే.. అల్లరి నరేశ్ హీరోగా భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లరి నరేశ్ స్నేహితుడిగా సునీల్ నటిస్తున్నాడు. తమిళ సినిమాకు ఇది రీమేక్‌గా రూపొందుతోంది.
పూర్ణ కీలకపాత్రలో కనిపించనుంది. మరి ఆమె పాత్రకున్న ప్రాధాన్యత ఎలాంటిదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇంతకు ముందు నరేశ్, భీమినేని శ్రీనివాసరావు కాంబినేషన్‌లో 'సుడిగాడు' సినిమా మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com