తెలుగు 'దృశ్యం 2'లో పూర్ణ..!
Send us your feedback to audioarticles@vaarta.com
‘ఎఫ్ 3’ మూవీ సెట్స్‌పై ఉండగానే నెక్ట్స్ ప్రాజెక్ట్‌గా మరో సినిమాను ట్రాక్ ఎక్కించేశాడు. అంత స్పీడుగా విక్టరీ వెంకటేష్ ఉన్నాడు మరి. ఇంతకీ వెంకటేష్ స్టార్ట్ చేసిన సినిమా ఏదో చెప్పనక్కర్లేదు. మలయాళ రీమేక్ దృశ్యం 2. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా చేసిన దృశ్యం సీక్వెల్‌గా దశ్యం 2 రూపొంది, రీసెంట్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓటీటీలోనే విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. తెలుగులో దృశ్యం రీమేక్‌లో వెంకటేష్ హీరోగా నటించాడు కాబట్టి. సీక్వెల్‌లోనూ ఆయనే కథనాయకుడిగా నటించడానికి ఆసక్తి చూపించి వెంటనే సినిమాను స్టార్ట్ చేసేశాడు.
అందులో భాగంగా తెలుగు దృశ్యం 2ను ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేశాడు వెంకీ. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ షూటింగ్ ఆల్‌రెడీ స్టార్ట్ అయ్యింది. రెండు నెలల్లోపే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేసి జూన్, జూలై నెలల్లో విడుదల చేసేలా నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. తెలుగు దృశ్యంను శ్రీప్రియ డైరెక్ట్ చేసింది. అయితే దృశ్యం 2ను జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్నాడు. వెంకటేష్, మీనా సహా ఇతర తారాగణం నటిస్తుండగా, మలయాళంలో రెండు పాత్రలు కీలకంగా నటించాడు. ఆ పాత్రల్లో ఓ పాత్ర మహిళ. ఆ రోల్‌ను పూర్ణతో చేయిస్తున్నారట యూనిట్. కథలో ఈ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, పూర్ణ ఏ పాత్ర చేసుకుంటుందనేది మలయాళ దృశ్యం 2 చూసిన వారికి సులభంగానే అర్థమవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com