తెలుగు 'దృ‌శ్యం 2'లో పూర్ణ..!

  • IndiaGlitz, [Tuesday,March 09 2021]

‘ఎఫ్ 3’ మూవీ సెట్స్‌పై ఉండ‌గానే నెక్ట్స్ ప్రాజెక్ట్‌గా మ‌రో సినిమాను ట్రాక్ ఎక్కించేశాడు. అంత స్పీడుగా విక్ట‌రీ వెంక‌టేష్ ఉన్నాడు మ‌రి. ఇంత‌కీ వెంక‌టేష్ స్టార్ట్ చేసిన సినిమా ఏదో చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌ల‌యాళ రీమేక్ దృశ్యం 2. మ‌లయాళంలో మోహ‌న్‌లాల్ హీరోగా చేసిన దృశ్యం సీక్వెల్‌గా ద‌శ్యం 2 రూపొంది, రీసెంట్‌గా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఓటీటీలోనే విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. తెలుగులో దృశ్యం రీమేక్‌లో వెంక‌టేష్ హీరోగా నటించాడు కాబ‌ట్టి. సీక్వెల్‌లోనూ ఆయ‌నే క‌థ‌నాయ‌కుడిగా న‌టించ‌డానికి ఆస‌క్తి చూపించి వెంట‌నే సినిమాను స్టార్ట్ చేసేశాడు.

అందులో భాగంగా తెలుగు దృశ్యం 2ను ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా స్టార్ట్ చేసేశాడు వెంకీ. ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ షూటింగ్ ఆల్‌రెడీ స్టార్ట్ అయ్యింది. రెండు నెల‌ల్లోపే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేసి జూన్‌, జూలై నెల‌ల్లో విడుద‌ల చేసేలా నిర్మాత‌లు ప్లాన్ చేసుకుంటున్నారు. తెలుగు దృశ్యంను శ్రీప్రియ డైరెక్ట్ చేసింది. అయితే దృశ్యం 2ను జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్నాడు. వెంక‌టేష్‌, మీనా స‌హా ఇత‌ర తారాగ‌ణం న‌టిస్తుండ‌గా, మ‌ల‌యాళంలో రెండు పాత్ర‌లు కీల‌కంగా న‌టించాడు. ఆ పాత్ర‌ల్లో ఓ పాత్ర మ‌హిళ‌. ఆ రోల్‌ను పూర్ణ‌తో చేయిస్తున్నార‌ట యూనిట్‌. క‌థ‌లో ఈ పాత్ర చాలా కీల‌కంగా ఉంటుంద‌ని, పూర్ణ ఏ పాత్ర చేసుకుంటుందనేది మ‌ల‌యాళ దృశ్యం 2 చూసిన వారికి సుల‌భంగానే అర్థ‌మ‌వుతుంది.

More News

విమెన్స్ డే వేదికగా భర్త విషయమై నోరు జారిన శివజ్యోతి

ఓ ప్రముఖ ఛానల్‌లో ప్రసారమైన ‘తీన్‌మార్’ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది యాంకర్ శివజ్యోతి. అందరు న్యూస్ యాంకర్‌లలాగే ప్రేక్షకులు శివజ్యోతిని చూశారు తప్ప ఓ సెలబ్రిటీ స్టేటస్ అయితే ఇవ్వలేదు.

విల‌న్‌గా మారుతున్న లారెన్స్‌..?

సైడ్ డాన్స‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌గా మారి అక్క‌డి నుంచి న‌టుడు.. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడు, నిర్మాత ఇలా అన్నింట త‌న మార్క్ క్రియేట్ చేసుకుంటూ వ‌చ్చిన రాఘ‌వ లారెన్స్ ఇప్పుడు కొత్త

డాన్స్ ఛాలెంజ్ పూర్తి చేసిన స‌మంత‌.. ఫిదా అయిన సెలబ్రిటీలు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత శాంకుత‌లం అనే సినిమా మిన‌హా మ‌రో సినిమాలో న‌టించ‌లేదు. బిజి బిజీగా న‌టించే స‌మంత అక్కినేని, ఇప్పుడు ఎందుకు సినిమాలు చేయ‌డం లేద‌నేది మాత్రం స‌మాధానం లేని

‘ఏక్ మినీ కథ’ పోస్టర్ ఏం చెబుతోందంటే..

కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌ను స్థాపించారు. ఈ బ్యానర్‌లో నిర్మాణం పూర్తి చేసుకున్న చిత్రం

ఎన్టీఆర్ హోస్ట్‌గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’.. ప్రకటన వచ్చేసింది

'బిగ్‌బాస్’ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. బిగ్‌బాస్ సీజన్ 1తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. తొలిసారిగా బుల్లితెరపై అడుగుపెట్టినప్పటికీ అదరగొట్టేశాడు. హోస్ట్ అంటే ఇలాగే ఉండాలి