మరో హర్రర్ థ్రిల్లర్ లో పూర్ణ

  • IndiaGlitz, [Monday,November 28 2016]

ప‌న్నా రాయ‌ల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ 'కాలింగ్ బెల్‌'. 2015లో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యాన్నే సొంతం చేసుకుంది. దాంతో ద‌ర్శ‌కుడు ప‌న్నా రాయ‌ల్ అప్ప‌ట్లోనే ఈ సినిమాకు సీక్వెల్ చేస్తాన‌ని తెలియ‌జేసిన సంగ‌తి విదిత‌మే. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ కాలింగ్ బెల్ సీక్వెల్ చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సీక్వెల్‌లో పూర్ణ న‌టిస్తుంది.
ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ డిసెంబ‌ర్‌లో విడుద‌ల కానుంది. రీసెంట్‌గా జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా చిత్రంతో స‌క్సెస్ సాధించిన పూర్ణ గ‌తంలో రాజుగారి గ‌ది చిత్రంలో దెయ్యం పాత్ర‌లో న‌టించింది. మ‌రి కాలింగ్ బెల్ సీక్వెల్‌లో పూర్ణ దెయ్యం క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డుతుందా? లేదా అని తెలియాలంటే వేచి చూడాల్సిందే....