అందరూ వద్దన్నా... అందుకే శ్రీనివాస రెడ్డితో చేశా: పూర్ణ (ఇంటర్వ్యూ)

  • IndiaGlitz, [Thursday,November 24 2016]

శ్రీమ‌హాల‌క్ష్మి, సీమ‌ట‌పాకాయ్, అవును, ల‌డ్డుబాబు, అవును 2, రాజు గారి గ‌ది త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన క‌థానాయిక పూర్ణ‌. తాజాగా శ్రీనివాస‌రెడ్డి - పూర్ణ జంట‌గా న‌టించిన చిత్రం జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా. ఈ చిత్రాన్ని శివ‌రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై శివ‌రాజ్ క‌నుమూరి స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించారు. స‌మైక్యంగా న‌వ్వుకుందాం అనే ట్యాగ్ లైన్, దేశ‌వాళి ఎంట‌ర్ టైన్మెంట్ అనే నినాదంతో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు ఈనెల 25న వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా క‌థానాయిక పూర్ణ‌తో ఇంట‌ర్ వ్యూ మీకోసం...!

జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా సినిమా ఎలా ఉంటుంది..?

నేను ఇప్ప‌టి వ‌ర‌కు హ‌ర్ర‌ర్ మూవీస్ చాలా చేసాను. ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంది. భాగ్య‌రాజా గారి సినిమా ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. ప్రివ్యూ కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది అని విన్నాను. ఖ‌చ్చితంగా మా సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది.

ఈ చిత్రంలో మీ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది..?

నేను ఇప్ప‌టి వ‌ర‌కు హ‌ర్ర‌ర్ మూవీస్ చాలా చేసాను. ఈ చిత్రంలో నా క్యారెక్ట‌ర్ నా గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది. నా క్యారెక్ట‌ర్ పేరు రాణి. నేను రియ‌ల్ లైఫ్ లో చాలా ఎక్కువుగా మాట్లాడుతుంటాను. కానీ...ఈ సినిమాలో చాలా త‌క్కువుగా మాట్లాడే పాత్ర పోషించాను.

ఎప్పుడూ మాట్లాడుతుండే మీరు...చాలా త‌క్కువుగా మాట్లాడే క్యారెక్ట‌ర్ చేస్తున్న‌ప్పుడు ఏమ‌నిపించింది...?

కాస్త క‌ష్ట‌మే అనిపించింది. కాక‌పోతే...డైరెక్ట‌ర్ ఎలా చెబితే అలా చేయ‌డంతో ఈజీ అయ్యింది...!

న్యూ డైరెక్ట‌ర్ శివ‌రాజ్ క‌నుమూరి వ‌ర్కింగ్ స్టైల్ ఎలా ఉంది..?

నేను ఇప్ప‌టి వ‌ర‌కు కొత్త డైరెక్ట‌ర్స్ తోను అలాగే సీనియ‌ర్ డైరెక్ట‌ర్స్ తోను వ‌ర్క్ చేసాను. అయితే...శివ‌రాజ్ క‌నుమూరి లాంటి డైరెక్ట‌ర్ తో వ‌ర్క్ చేయ‌డం అంటే ఓ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ తో వ‌ర్క్ చేసిన ఫీలింగ్ క‌లిగింది. ప్ర‌తి సీన్ గురించి చాలా కేర్ తీసుకునేవారు. నా ప‌ర్ ఫార్మెన్స్ కానీ మూవీ కానీ బాగుంది అంటే ఆ క్రెడిట్ అంతా డైరెక్ట‌ర్ శివ‌రాజ్ కే చెందుతుంది. ఈ చిత్రానికి శివ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు నిర్మాత కూడా ఆయ‌నే. క్లైమాక్స్ సీన్స్ ను నాలుగు కెమెరాల‌తో చిత్రీక‌రించారు. నిర్మాణప‌రంగా ఏమాత్రం రాజీప‌డ‌కుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.

క‌మెడియ‌న్ శ్రీనివాస‌రెడ్డి హీరోగా, మీరు హీరోయిన్ గా న‌టించాలి అన్న‌ప్పుడు వెంట‌నే ఓకే చెప్పారా..? కాస్త ఆలోచించి ఓకే చెప్పారా..?

శ్రీనివాస్ రెడ్డి గారితో క‌లిసి గీతాంజ‌లి సినిమాలో చేయాలి కుద‌ర‌లేదు. ఆత‌ర్వాత మ‌రో సినిమా అనుకున్నా అది కుద‌ర‌లేదు. ఫైన‌ల్ గా ఈ మూవీకి కుదిరింది. శ్రీనివాస‌రెడ్డి గారు హీరోగా న‌టించే సినిమా అన‌గానే కొంత మంది న‌న్నుఈ సినిమా చేయ‌ద్దు అని చెప్పారు. అయితే...క‌థ విన్నాను బాగా నచ్చింది అందుక‌నే న‌టించాను. ఎవ‌రు ఏం చెప్పినా వింటాను కానీ...ఫైన‌ల్ గా నిర్ణ‌యం మాత్రం నేనే తీసుకుంటాను.

హ‌ర్ర‌ర్ మూవీస్ చాలా చేసారు క‌దా...! హ‌ర్ర‌ర్ మూవీస్ అంటే ఇష్ట‌మా..?

హ‌ర్ర‌ర్ మూవీస్ అంటే నాకు ఇష్టం కాదండీ...! భ‌యం..! నేను న‌టించిన హ‌ర్ర‌ర్ మూవీ అవును థియేట‌ర్ లో చూడ‌లేదు. టీవీలో వ‌స్తే చూసాను. చీక‌టి అంటే భ‌యం. మ‌ల‌యాళంలో కూడా ఎక్కువుగా హ‌ర్ర‌ర్ మూవీస్ లో న‌టించ‌డం వ‌ల‌న న‌న్ను హ‌ర్ర‌ర్ క్వీన్ అంటారు.

అదృష్టాన్ని న‌మ్ముతారా..? హార్డ్ వ‌ర్క్ ను న‌మ్ముతారా..?

రెండు ఉండాలి అంటాను. మ‌న‌కు ఎంత టాలెంట్ ఉన్నా...అదృష్టం అనేది లేక‌పోతే రాణించ‌లేం. అందుచేత మ‌న టాలెంట్ తో హార్డ్ వ‌ర్క్ చేస్తే దానికి అదృష్టం క‌లిస్తే మ‌రింత‌గా రాణించ‌వ‌చ్చు అనేది న‌మ్ముతాను.

ఇంత‌కీ...మీకు ల‌క్ ఉంది అనుకుంటున్నారా..?

ల‌క్ ఉందో లేదో తెలియ‌డం లేదు. నాకు ఆశించినంత‌గా స‌క్సెస్ రాక‌పోయినా న‌టిగా మంచి పేరు వ‌చ్చినందుకు హ్యాపీ.

డ్యాన్స్ మీకు బాగా ఇష్టమా...?

డ్యాన్స్ అంటే నాకు ఇష్టం కాదు...ప్రాణం. డ్యాన్సే నా లైఫ్. మా ఊరులో డ్యాన్స్ నేర్చుకున్న ఫ‌స్ట్ ముస్లిం అమ్మాయి నేనే. డ్యాన్స్ - సినిమా ఈరెండు నాకు స‌మానం.

మీరు ఎక్కువుగా సినిమాలు చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం..?

నేను ఎక్కువ సినిమాలు చేసేసి బిజీగా ఉండాలి అనుకోవ‌డం లేదు. మంచి క‌థ మంచి పాత్ర అయితేనే చేస్తున్నాను.

శ్రీమంతుడు సినిమాలో ఓ సాంగ్ లో న‌టించారు క‌దా..! స్పెష‌ల్ సాంగ్స్ & ఐట‌మ్ సాంగ్స్ చేయ‌డానికి రెడీనా..?

నేను హైద‌రాబాద్ లో అడుగుపెట్ట‌గానే ఫ‌స్ట్ మ‌హేష్ బాబు పోస్ట‌ర్ చూసాను. అంతే....అప్ప‌టి నుంచి మ‌హేష్ బాబుతో ల‌వ్ లో ప‌డిపోయాను. అందుచేత మ‌హేష్ బాబు సినిమాలో స్పెష‌ల్ సాంగ్ లో చేయాలి అన‌గానే వెంట‌నే ఓకే చెప్పాను. స్పెష‌ల్ సాంగ్స్ చేస్తారా అంటే చేస్తాను. కానీ...ఐట‌మ్ సాంగ్స్ మాత్రం చేయ‌ను. అలాగ‌ని ఐట‌మ్ సాంగ్స్ అంటే అదేదో చేయ‌కూడ‌దు అని కాదు. నా డ్యాన్స్ ఐట‌మ్ సాంగ్స్ కి సెట్ కాదు అనేది నా ఫీలింగ్.

నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి..?

తెలుగులో నేను న‌టించే నెక్ట్స్ మూవీలో మూడు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాను. సోమ‌వారం నుంచి షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. ఆ సినిమా ఏమిటి...? హీరో & డైరెక్ట‌ర్ ఎవ‌రు..? అని అడ‌గ‌కండి. ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ఎనౌన్స్ చేస్తారు.