బాలయ్య సినిమా ‘బీబీ3’లో లేడీ విలన్‌గా పూర్ణ?
Send us your feedback to audioarticles@vaarta.com
బోయపాటి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ హ్యాట్రిక్ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ‘సింహా’ ‘లెజెండ్’ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. ‘బిబి3’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘గాఢ్ ఫాదర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ సయేషా సైగల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ప్రముఖ నటి పూర్ఝ కూడా నటిస్తోంది. అయితే ఆమె పాత్రే ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో పూర్ణ నెగిటివ్ రోల్‌లో నటించనుందని టాక్. లేడీ విలన్‌గా పూర్ణ ఆకట్టుకోగలిగితే అమ్మడికి ఆఫర్లు వెల్లువెత్తుతాయనడంలో సందేహం లేదని తెలుస్తోంది. అన్‌లాక్ తర్వాత ఈ చిత్రం ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం 60 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్టు సమాచారం.
ద్వారకా క్రియేషన్స్ పతాకంపై నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబో కావడంతో ఈ చిత్రం పక్కాగా హ్యాట్రిక్ అందుకుంటుందని ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ చెప్పకనే చెబుతున్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం.. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా మే 28న విడుదల కాబోతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com