మీరా వ్యవహారంపై పూనమ్ షాకింగ్ ట్వీట్..!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను వేధిస్తున్నారంటూ బాలీవుడ్ నటి మీరా చోప్రా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే ఇష్టమని.. జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదని మీరా చెప్పడమే పెద్ద మిస్టేక్.! ఈ ఒక్క మాటను పట్టుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరాను దుమ్మెత్తి పోస్తున్నారు. తీవ్ర అసభ్య పదజాలంతో మెసేజ్‌లు చేయడం.. కొందరు అభిమానులు అయితే ఏకంగా చంపేస్తామని బెదిరించడం, గ్యాంగ్ రేప్ చేస్తామని ఈ విషయాలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను జోడిస్తూ పోలీసులకు మీరా ఫిర్యాదు చేసింది. అభిమానుల అత్యుత్సాహం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే పలువురు ప్రముఖులు, జాతీయ మహిళా కమిషన్ సైతం స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా ట్విట్టర్ వేదికగా నటి పూనమ్ కౌర్ స్పందిస్తూ షాకింగ్ ట్వీట్ చేసింది.
అప్పుడలా.. ఇప్పుడిలా..!
కాగా.. పూనమ్ కూడా ఇదివరకే ఇలాంటి బాధలు ఎన్నో పడ్డది. ఆ అనుభవాన్ని అంతా రంగరించి ఓ ట్వీట్ చేసింది. ‘ఫ్యాన్స్ తప్పేం లేదు. ఈ వివాదంలో అనవసరంగా ఫ్యాన్స్‌ని బ్లేమ్ చేయొద్దు.. నిజంగా వాళ్లు చాలా అమాయకులు. వాళ్లను కావాలనే కొందరు స్వలాభం కోసం వాడుకుంటున్నారు. ఎటువంటి కారణం లేకుండా నా పేరు ఈ వివాదంలోకి లాగినా కూడా అభిమానులపై కోపంగా లేను. వాళ్లపై ఫిర్యాదు కూడా చేయలేదు’ అని చెప్పుకొచ్చింది. అయితే అప్పట్లో కేసు పెట్టిన పూనమ్ ఇప్పుడెందుకిలా టోన్ మార్చేసిందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి చూస్తే.. ఇప్పటికీ వాళ్లు అమాయకులనే అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూనమ్ చేసిన ఈ ట్వీట్ మరోసారి నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యింది.
We don’t even know if these fans are fake accounts created by political gains and at the end the actor gets blamed no matter who it is .... accept that our industry is interlinked with one political party each .fans are innocent people ,few political people are evil .they do this
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 5, 2020
No actor wants his fans to abuse any one , it’s created by jealous factors in and around the industry n media . They don’t have time for this . Trolling is a part of actors life . Criminal acts needs to be reported . Trolling is a game done to victimse u .dont bother .move on!
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 5, 2020
While my name is dragged consistently for no reason ,till date I have not complaint a single thing on fans, Itruly believe they are innocent nare instigated my middlepeople of media for their gains ,I have launched complain only on people whotroubled me.Don’t blame fans for wars
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 5, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments