మీరా వ్యవహారంపై పూనమ్ షాకింగ్ ట్వీట్..!

  • IndiaGlitz, [Saturday,June 06 2020]

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను వేధిస్తున్నారంటూ బాలీవుడ్ నటి మీరా చోప్రా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే ఇష్టమని.. జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదని మీరా చెప్పడమే పెద్ద మిస్టేక్.! ఈ ఒక్క మాటను పట్టుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ మీరాను దుమ్మెత్తి పోస్తున్నారు. తీవ్ర అసభ్య పదజాలంతో మెసేజ్‌లు చేయడం.. కొందరు అభిమానులు అయితే ఏకంగా చంపేస్తామని బెదిరించడం, గ్యాంగ్ రేప్ చేస్తామని ఈ విషయాలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను జోడిస్తూ పోలీసులకు మీరా ఫిర్యాదు చేసింది. అభిమానుల అత్యుత్సాహం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే పలువురు ప్రముఖులు, జాతీయ మహిళా కమిషన్ సైతం స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా ట్విట్టర్ వేదికగా నటి పూనమ్ కౌర్ స్పందిస్తూ షాకింగ్ ట్వీట్ చేసింది.

అప్పుడలా.. ఇప్పుడిలా..!

కాగా.. పూనమ్ కూడా ఇదివరకే ఇలాంటి బాధలు ఎన్నో పడ్డది. ఆ అనుభవాన్ని అంతా రంగరించి ఓ ట్వీట్ చేసింది. ‘ఫ్యాన్స్ తప్పేం లేదు. ఈ వివాదంలో అనవసరంగా ఫ్యాన్స్‌ని బ్లేమ్ చేయొద్దు.. నిజంగా వాళ్లు చాలా అమాయకులు. వాళ్లను కావాలనే కొందరు స్వలాభం కోసం వాడుకుంటున్నారు. ఎటువంటి కారణం లేకుండా నా పేరు ఈ వివాదంలోకి లాగినా కూడా అభిమానులపై కోపంగా లేను. వాళ్లపై ఫిర్యాదు కూడా చేయలేదు’ అని చెప్పుకొచ్చింది. అయితే అప్పట్లో కేసు పెట్టిన పూనమ్ ఇప్పుడెందుకిలా టోన్ మార్చేసిందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి చూస్తే.. ఇప్పటికీ వాళ్లు అమాయకులనే అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూనమ్ చేసిన ఈ ట్వీట్ మరోసారి నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యింది.