Poonam Kaur: 'అహంకారమా, అజ్ఞానమా' : పవన్ మూవీ పోస్టర్‌పై పూనం కౌర్ షాకింగ్ కామెంట్స్, ఆప్ నేత మద్ధతు.. ఫ్యాన్స్ గరం
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ సినీనటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ఆమె టార్గెట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ కాబోతోందని చెప్పేందుకు ఈ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దీనిపై పూనమ్ కౌర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పోస్టర్‌లో పవన్ కల్యాణ్ కాళ్లు మాత్రమే కనిపిస్తాయి. దీని కింద ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ వుంటుంది. దీనిని ఆమె తప్పుబడుతున్నారు. ఈ మేరకు ట్వీట్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.
విప్లవకారులను అవమానించొద్దనన పూనమ్:
విప్లవకారులను గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అవమానించొద్దని పూనమ్ కౌర్ హితవు పలికారు. ఈ మధ్య విడుదలైన ఓ సినిమా పోస్టర్‌లో భగత్ సింగ్ అనే పేరుపై కాళ్లు వున్నాయి.. ‘‘ఇది అహంకారమా, అజ్ఞానమా అంటూ ఆమె ప్రశ్నించారు. ఉస్తాద్ భగత్ సింగ్ యూనిట్‌కు దీనిని రిపోర్ట్ చేయాల్సిందిగా పూనం కౌర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆమెను ఏకీపారేస్తున్నారు. వివాదాలతో వార్తల్లో నిలవాలని అనుకుంటున్నావా.. మీడియాలో ఫోకస్ అవ్వాలనే ఇంత రాద్దాంతం చేస్తున్నావా అంటూ ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్ అవుతోంది.
పూనమ్ కౌర్‌కు ఆప్ నేత మద్ధతు :
అయితే పూనమ్ కౌర్ ట్వీట్‌కు మద్ధతు పలికేవారు కూడా లేకపోలేదు. పంజాబ్‌కు చెందిన అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇందర్‌వన్ష్ సింగ్ చద్దా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ యూనిట్‌ను తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘‘ఉస్తాద్ భగత్ సింగ్ ’’ అనే దక్షిణాది సినిమా పోస్టర్‌ను ఖండిస్తున్నా. ఇందులో ఓ వ్యక్తి కాళ్ల కింద భగత్ సింగ్ పోస్టర్ వుందని, ఈ ఫోటో ప్రస్తుతం గూగుల్‌లో వుందని’’ పేర్కొన్నారు. దీంతో ఆయనకు కూడా పవన్ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు.
సంధ్య 35 ఎంఎంలో ఉస్తాద్ గ్లింప్స్:
ఇదిలావుండగా.. పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పారు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మేకర్స్. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను మే 11న రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ రోజు సాయంత్రం 4.59 గంటలకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 35 ఎంఎం థియేటర్‌లో లాంచింగ్‌కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే.. మే 11కు ఓ ప్రత్యేకత వుంది. హరీశ్ శంకర్- పవన్ కల్యాణ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’’ విడుదలై ఆ రోజుకు 11 ఏళ్లు పూర్తికానున్నాయి. ఇన్నేళ్ల విరామంత తర్వాత తిరిగి పవన్, హరీశ్ శంకర్‌లు సినిమా చేస్తుండటంతో ఆ రోజునే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు మేకర్స్.
When u cannot respect revolutionaries atleast don’t insult them - a recent poster release for a movie - insults the name #bhagatsingh by placing it below foot - ego or ignorance ?
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 11, 2023
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com