పూనమ్ సెన్సేషనల్ ట్వీట్స్.. టార్గెట్ ఎవరు?
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో దక్షిణాదిన కూడా ప్రకంపనలు మొదలయ్యాయి. కొందరు స్టార్స్ తమకు ఎదురైన అనుభవాలు తెలియజేస్తన్నారు. ఈ క్రమంలో పూనమ్ కౌర్ తను డిప్రెషన్లో ఉన్నప్పుడు తనకు ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. అయితే పూనమ్ చేసిన ట్వీట్స్ చూసిన నెటిజన్స్ ఈమె ఓ దర్శకుడిని టార్గెట్ చేసిందని అంటున్నారు.
‘‘నా స్నేహితులు ఆ దర్శకుడిని రెండు, మూడు సార్లు సంప్రదించారు. మీరు ఏదైనా చేసి ఆమెను కాపాడాలి. ఆమె పరిస్థితి ఏమీ బాగోలేదని చెప్పారు. అయితే ఆ దర్శకుడు మాత్రం తన స్టైల్లో లేట్ చేస్తూ వచ్చాడు. దీంతో నాకు ఏం చేయాలో తెలియలేదు. తర్వాత నేను ఆ దర్శకుడితో మాట్లాడాను. నా పరిస్థితి బాగాలేదు. చచ్చిపోవాలనిపిస్తుందని చెప్పాను. దానికి ఆ దర్శకుడు ‘ఏమీ జరగదు..నువ్వు చచ్చిపోతే ఒకరోజు న్యూస్‌లో ఉంటావు’ అన్నాడు. ఆ మాటలతో నాపై నాకే అసహ్యం వేసింది. మీడియాను, మీడియా మాఫియాలను అతనే నియంత్రిస్తాడు. అందుకే అతను నాపై కొన్ని వెబ్‌సైట్స్‌లో తప్పుడు ఆర్టికల్స్ రాయించాడు. దీంతో నేను మరింత డిప్రెషన్లోకి వెళ్లాను. అర్థరాత్రిలో ప్రాబ్లెమ్ వస్తే నేను వస్తాను. నువ్వు చచ్చిపోతే ఓ రోజు వార్తల్లో ఉంటావు అనేంత వరకు వచ్చింది. అయినా నేను ఎందుకు బాధపడాలి?
నా పేరుని నువ్వు సినిమా నుంచి తొలగించావు. ఆడియో ఫంక్షన్స్‌లో కనిపించకుండా చేశావు. సావిత్రిగారి గురించి స్టేజీ మీద గొప్పగా మాట్లాడే ఆ వ్యక్తి తెలుగు నటికి ఒకరికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. నీకు మినిస్టర్ పిల్లలు తెలిసి ఉండొచ్చు. అయితే ఏంటి? నాకు తెలిసి నువ్వే సిక్. ఆ తర్వాత నాకు సంబంధించిన సమస్యను పరిష్కరించమని నేను ఆ దర్శకుడిని సంప్రదించలేదు. ఆయనకున్న మానిపులేటింగ్ టెక్నిక్స్, ఆయనకున్న పరిచయాల శక్తిని తప్పుగా ఉపయోగించటం, తనకు నచ్చిన వారికే అవకాశాలివ్వడం, భజన తప్ప మరేమీ చేయకపోవడం, నన్ను సైలెంట్‌గా బ్యాన్ చేయటం.. ఇంతకు మించి ఏం చేయగలవు గురూజీ’’ అంటూ ట్వీట్స్ చేసింది పూనమ్. ఈ ట్వీట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Speaking about Savitiri Garu on the stage n never ever promoting a local talent ... rather stopping some one from doing that coz u think it’s not right after the girl was declared beautiful by ipl ...u know minister sons n big families so what ? I think u r sick n manipulative ..
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 17, 2020
journey with this man saying ‘’Madiya ratri kuda problem untey nenu vasTanu ....to nuvvu chachipotey one day news untavu ‘’ seriously? Why I was unwell,m still not ok you remove my name movie casting list u remove my pics from audio function,seriously? Those words resound!
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 17, 2020
Media is controlled by him ,movie mafia is controlled by him , advertisements are controlled by him,the way he communicated to me thru indirect articles online made me feel more sick thru my depression ...unnecessary articles putting me down ..I gave one reply n that was direct .
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 17, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com