పూన‌మ్ సెన్సేషనల్ ట్వీట్స్.. టార్గెట్ ఎవరు?

  • IndiaGlitz, [Wednesday,June 17 2020]

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య నేప‌థ్యంలో ద‌క్షిణాదిన కూడా ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయి. కొంద‌రు స్టార్స్ త‌మ‌కు ఎదురైన అనుభ‌వాలు తెలియ‌జేస్త‌న్నారు. ఈ క్ర‌మంలో పూన‌మ్ కౌర్ త‌ను డిప్రెష‌న్‌లో ఉన్న‌ప్పుడు త‌న‌కు ఎదురైన అనుభ‌వాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. అయితే పూన‌మ్ చేసిన ట్వీట్స్ చూసిన నెటిజ‌న్స్ ఈమె ఓ ద‌ర్శ‌కుడిని టార్గెట్ చేసింద‌ని అంటున్నారు.

‘‘నా స్నేహితులు ఆ దర్శకుడిని రెండు, మూడు సార్లు సంప్ర‌దించారు. మీరు ఏదైనా చేసి ఆమెను కాపాడాలి. ఆమె ప‌రిస్థితి ఏమీ బాగోలేద‌ని చెప్పారు. అయితే ఆ ద‌ర్శ‌కుడు మాత్రం త‌న స్టైల్లో లేట్ చేస్తూ వ‌చ్చాడు. దీంతో నాకు ఏం చేయాలో తెలియ‌లేదు. త‌ర్వాత నేను ఆ ద‌ర్శ‌కుడితో మాట్లాడాను. నా ప‌రిస్థితి బాగాలేదు. చ‌చ్చిపోవాల‌నిపిస్తుంద‌ని చెప్పాను. దానికి ఆ ద‌ర్శ‌కుడు ‘ఏమీ జరగదు..నువ్వు చచ్చిపోతే ఒక‌రోజు న్యూస్‌లో ఉంటావు’ అన్నాడు. ఆ మాటలతో నాపై నాకే అసహ్యం వేసింది. మీడియాను, మీడియా మాఫియాలను అతనే నియంత్రిస్తాడు. అందుకే అతను నాపై కొన్ని వెబ్‌సైట్స్లో తప్పుడు ఆర్టికల్స్ రాయించాడు. దీంతో నేను మరింత డిప్రెషన్‌లోకి వెళ్లాను. అర్థరాత్రిలో ప్రాబ్లెమ్ వస్తే నేను వస్తాను. నువ్వు చచ్చిపోతే ఓ రోజు వార్తల్లో ఉంటావు అనేంత వరకు వచ్చింది. అయినా నేను ఎందుకు బాధపడాలి?

నా పేరుని నువ్వు సినిమా నుంచి తొలగించావు. ఆడియో ఫంక్షన్స్‌లో కనిపించకుండా చేశావు. సావిత్రిగారి గురించి స్టేజీ మీద గొప్పగా మాట్లాడే ఆ వ్యక్తి తెలుగు నటికి ఒకరికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. నీకు మినిస్టర్ పిల్లలు తెలిసి ఉండొచ్చు. అయితే ఏంటి? నాకు తెలిసి నువ్వే సిక్‌. ఆ త‌ర్వాత నాకు సంబంధించిన స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌మ‌ని నేను ఆ ద‌ర్శ‌కుడిని సంప్ర‌దించ‌లేదు. ఆయ‌న‌కున్న మానిపులేటింగ్ టెక్నిక్స్‌, ఆయ‌న‌కున్న ప‌రిచ‌యాల శ‌క్తిని త‌ప్పుగా ఉప‌యోగించ‌టం, త‌న‌కు న‌చ్చిన వారికే అవ‌కాశాలివ్వ‌డం, భ‌జ‌న త‌ప్ప మ‌రేమీ చేయ‌క‌పోవ‌డం, న‌న్ను సైలెంట్‌గా బ్యాన్ చేయ‌టం.. ఇంత‌కు మించి ఏం చేయ‌గ‌ల‌వు గురూజీ’’ అంటూ ట్వీట్స్ చేసింది పూన‌మ్‌. ఈ ట్వీట్స్ ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

More News

రీ రికార్డింగ్ దశలో యాక్షన్ అండ్ సోషియో థ్రిల్లర్ మూవీ  'క్లూ'

నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలో కరోనా సంక్షోభం ఏర్పడటంతో వందలాది చిత్రాల విడుదల  విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది.

పూరి స్క్రిప్ట్ చేంజ‌స్ చేస్తున్నాడా?

పూరి కొన్ని విష‌యాల్లో చాలా నిక్క‌చ్చిగా ఉంటాడు. ఒక‌సారి స్క్రిప్ట్ లాక్ అయిన త‌ర్వాత మార్పులంటే ఎవ‌రు చెప్పినా విన‌డు.

నెపోటిజంకు వ‌ర్మ మ‌ద్ద‌తు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్యతో బాలీవుడ్ వ‌ర్గాలు షాక్ అయ్యాయి.

డిజిటల్‌లో ‘ల‌క్ష్మీబాంబ్’ డేట్ ఫిక్స‌య్యిందా?

క‌రోనా ఎఫెక్ట్‌తో సినిమా ప‌రిశ్ర‌మ‌కు గ‌డ్డుకాలం న‌డుస్తుంద‌నే చెప్పాలి. థియేట‌ర్స్ మూత ప‌డ‌టంతో సినిమాలు రిలీజ్‌లు ఆగిపోయాయి.

చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ చీక‌టి కోణం ఉంది:  పాయ‌ల్ రాజ్‌పుత్‌

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య‌తో బాలీవుడ్ దిగ్భ్రాంతికి లోనైంది. నెపోటిజం కార‌ణంగానే సుశాంత్ చ‌నిపోయాడంటూ విమర్శ‌లు చేల‌రేగుతున్నాయి.