50 యూట్యూబ్ ఛానల్స్‌ పై నటి పూనమ్‌కౌర్ ఫిర్యాదు

  • IndiaGlitz, [Tuesday,April 16 2019]

గత కొన్ని రోజులుగా హీరోయిన్ పూనమ్‌కౌర్‌కు సంబంధించిన కొన్ని ఆడియో, వీడియోలు యూట్యూబ్‌లో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సీజన్ కావడంతో కొన్ని వర్గాలు మరింత రెచ్చిపోయి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయి.

దీంతో ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న పూనమ్ ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించింది. మంగళవారం నాడు హైదరాబాద్‌లోని సైబర్‌క్రైమ్ పోలీసులకు పూనమ్ ఫిర్యాదు చేసింది.ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. యూట్యూబ్లో ఉద్దేశపూర్వకంగానే నాపై అసభ్యకరమైన పోస్టింగ్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశానని తెలిపారు.

గత రెండేళ్లుగా నా పేరుతో కొంత మంది యూ ట్యూబ్‌లో వీడియో లింక్స్ పెడుతూ మానసిక వేదనకు గురి చేస్తున్నారు. సుమారు 50 యూట్యూబ్ ఛానల్స్‌పై ఫిర్యాదు చేశాను. ఇటువంటి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. సోషియల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులుకి ఫిర్యాదు చేశాను. 

కొంతమంది వ్యక్తులు నన్ను కించ పరిచే విధంగా పోస్టింగులు పెడుతున్నారు. నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు. యూట్యూబ్ లింకులు పోస్ట్ చేసిన వారి పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరాను అని పూనమ్ మీడియాకు వివరించింది. కాగా ఈ వ్యవహారం పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.

More News

'ఎర్రచీర' షూటింగ్ ప్రారంభం

శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై సిహెచ్‌. సుమన్‌ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎర్రచీర’. ఈ చిత్రం సోమవారంనాడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

వృద్ధాప్యం మ‌న‌సుకు కాదు

ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్స్ ట్రెండ్ ఇంకా త‌గ్గ‌లేదు. క్రీడా రంగానికి సంబంధించి మ‌రో బ‌యోపిక్ `సాండ్ కీ అంఖ్‌`త్వ‌రలోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

కేర‌ళ‌కు సైరా

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి' షూటింగ్ జ‌రుగుతోంది. సినిమాలో కీల‌క పోరాట స‌న్నివేశాల కోసం మొత్తం యూనిట్ కేర‌ళ‌కు వెళ్లింది.

మెగాస్టార్‌తో మెగా డైరెక్ట‌ర్‌

టాలీవుడ్ టాప్ స్టార్ మెగాస్టార్ చిరంజీవితో భారీ చిత్రాల ద‌ర్శ‌కుడు శంక‌ర్ సినిమా తీయ‌బోతున్నాడా?  అంటే అవుననే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

'జెర్సీ' సెన్సార్ పూర్తి

నాని హీరోగా గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కిస్తోన్న ఎమోష‌న‌ల్ క్రికెట్ డ్రామా 'జెర్సీ'. శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టించింది. తండ్రీ కొడుకుల మ‌ధ్య అనుబంధాన్ని చూపించే చిత్ర‌మే ఇది.