50 యూట్యూబ్ ఛానల్స్ పై నటి పూనమ్‌కౌర్ ఫిర్యాదు
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొన్ని రోజులుగా హీరోయిన్ పూనమ్‌కౌర్‌కు సంబంధించిన కొన్ని ఆడియో, వీడియోలు యూట్యూబ్‌లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సీజన్ కావడంతో కొన్ని వర్గాలు మరింత రెచ్చిపోయి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయి.
దీంతో ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న పూనమ్ ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించింది. మంగళవారం నాడు హైదరాబాద్‌లోని సైబర్‌క్రైమ్ పోలీసులకు పూనమ్ ఫిర్యాదు చేసింది.ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. యూట్యూబ్‌లో ఉద్దేశపూర్వకంగానే నాపై అసభ్యకరమైన పోస్టింగ్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశానని తెలిపారు.
"గత రెండేళ్లుగా నా పేరుతో కొంత మంది యూ ట్యూబ్‌లో వీడియో లింక్స్ పెడుతూ మానసిక వేదనకు గురి చేస్తున్నారు. సుమారు 50 యూట్యూబ్ ఛానల్స్‌పై ఫిర్యాదు చేశాను. ఇటువంటి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. సోషియల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులుకి ఫిర్యాదు చేశాను.
కొంతమంది వ్యక్తులు నన్ను కించ పరిచే విధంగా పోస్టింగులు పెడుతున్నారు. నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు. యూట్యూబ్ లింకులు పోస్ట్ చేసిన వారి పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరాను" అని పూనమ్ మీడియాకు వివరించింది. కాగా ఈ వ్యవహారం పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com