పండంటి పాపకు జన్మనిచ్చిన ‘విశ్వరూపం’ ఫేమ్
Send us your feedback to audioarticles@vaarta.com
‘విశ్వరూపం’ ఫేమ్ పూజా కుమార్ గుర్తుందా? ఆమెకు తాజాగా పండంటి పాప పుట్టింది. కొంత కాలం క్రితం ఎన్ఆర్ఐ విశాల్ జోషిని పూజా కుమార్ వివాహం చేసుకున్నారు. తాజాగా ఈ దంపతులకు పాప పుట్టింది. రాజశేఖర్ సరసన ‘గరుడవేగ’ చిత్రంలో కూడా పూజా కుమార్ నటించారు. ఆ తరువాత పూజాకు సంబంధించిన వివరాలేమీ తెలియరాలేదు. ఆమెకు సంబంధించిన ఫోటోలు కానీ.. సోషల్ మీడియాలో అకౌంట్స్ కానీ మెయిన్‌టైన్ చేయలేదు. కానీ తమకు పాప పుట్టిన విషయాన్ని విశాల్ జోషి తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.
పూజ తమ చిట్టి తల్లి నావ్యని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిందని విశాల్ జోషి ఇన్‌స్టాలో పేర్కొన్నారు. ‘‘ఒకప్పుడు మేము ఇద్దరం కానీ ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం. పూజా, నేను మా చిట్టి తల్లి నావ్య జోషిని మీకు పరిచయం చేసేందుకు చాలా సంతోషిస్తున్నాం. నాకు అద్భుతమైన జీవిత భాగస్వామిగా ఉన్నందుకు థాంక్యూ పూజా కుమార్. నేను కలలు కనే ఉత్తమ జీవిత భాగస్వామి అయినందుకు.. మా చిట్టితల్లి నావ్యను ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చినందుకు పూజకుమార్‌కి ధన్యవాదాలు.
మీరిద్దరూ నా ఈ పుట్టిన రోజును మరపురాని రోజుగా మార్చారు. మీ ఇద్దరినీ చాలా ప్రేమిస్తున్నాను’’ అని విశాల్ పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్‌పై పూజా కుమార్ మాత్రం ఇప్పటి వరకూ స్పందించలేదు. ఇంతకు ముందు పూజా ఎక్కువగా కమల్ హాసన్‌తో కనిపించేది. కమల్ హాసన్ కుటుంబానికి సంబంధించిన ఫోటోల్లో సైతం పూజా కుమార్ ఎక్కువగా కనిపిస్తూ ఉండేది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments