close
Choose your channels

Pooja Hegde: సొంతూరుకు ట్రిప్ వేసిన పూజా హెగ్డే.. చుడీదార్‌లో చిన్న పిల్లలా సరదాలు, ఫోటోలు వైరల్

Tuesday, April 25, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Pooja Hegde: సొంతూరుకు ట్రిప్ వేసిన పూజా హెగ్డే.. చుడీదార్‌లో చిన్న పిల్లలా సరదాలు, ఫోటోలు వైరల్

ప్రస్తుతం సౌత్‌తో పాటు నార్త్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది పూజాహెగ్డే. ‘‘ఒక లైలా కోసం’’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. వరుసపెట్టి సినిమాలు చేసినా చెప్పుకోదగ్గ పేరు రాలేదు. ఈ నేపథ్యంలో అల వైకుంఠపురం సినిమా బ్లాక్‏బస్టర్ హిట్ కొట్టడంతో పూజా రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. టాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్‌లలో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. 2020 నుంచి నేటి వరకు రిలీజైన స్టార్ హీరోల సినిమాలలో కథానాయిక పూజా హెగ్డేనే. ఆమె ఇప్పుడు ఎంత బిజీ అంటే కాల్‌షీట్లు, డేట్స్ అడ్జెస్ట్ చేయలేక కొన్ని సినిమాలను కూడా వదిలేసుకోవాల్సి వచ్చింది.

Pooja Hegde: సొంతూరుకు ట్రిప్ వేసిన పూజా హెగ్డే.. చుడీదార్‌లో చిన్న పిల్లలా సరదాలు, ఫోటోలు వైరల్

కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌లో నటిస్తోన్న పూజా హెగ్డే:

ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమాలో పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అటు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఓ పాటలో మెరిసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా కోసం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రత్యేకించి ఈ సినిమాలో తెరకెక్కించిన బతుకమ్మ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తెలంగాణ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ పాటను రూపొందించారు. ప్రస్తుతం 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' యూనిట్ మొత్తం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా వున్న సంగతి తెలిసిందే.

Pooja Hegde: సొంతూరుకు ట్రిప్ వేసిన పూజా హెగ్డే.. చుడీదార్‌లో చిన్న పిల్లలా సరదాలు, ఫోటోలు వైరల్

పూజా హెగ్డే తుళు ఆడపడుచు:

అయితే స్వల్ప విరామం దొరకడంతో హీరోయిన్ పూజా హెగ్డే తన సొంతూరుకు వెళ్లారు. కర్ణాటకలోని రేవు పట్టణం మంగళూరు పూజా హెగ్డే సొంతూరు. ముంబైలో వుంటున్నప్పటికీ ఆమె అప్పుడప్పుడు తన సొంతూరుకు వెళుతూ వుంటారు. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపించే పూజా.. తన వూరిలో మాత్రం సాంప్రదాయబద్ధంగా కనిపించేందుకే ప్రాధాన్యతనిస్తారు. దీనిలో భాగంగా చుడిదార్‌ ధరించి.. ప్రకృతిలో గడిపారు. పువ్వులు, ఆకులతో ఆడుతూ సరదాగా గడిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment