Pooja Hegde: సొంతూరుకు ట్రిప్ వేసిన పూజా హెగ్డే.. చుడీదార్‌లో చిన్న పిల్లలా సరదాలు, ఫోటోలు వైరల్

  • IndiaGlitz, [Tuesday,April 25 2023]

ప్రస్తుతం సౌత్‌తో పాటు నార్త్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది పూజాహెగ్డే. ‘‘ఒక లైలా కోసం’’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. వరుసపెట్టి సినిమాలు చేసినా చెప్పుకోదగ్గ పేరు రాలేదు. ఈ నేపథ్యంలో అల వైకుంఠపురం సినిమా బ్లాక్‏బస్టర్ హిట్ కొట్టడంతో పూజా రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. టాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్‌లలో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. 2020 నుంచి నేటి వరకు రిలీజైన స్టార్ హీరోల సినిమాలలో కథానాయిక పూజా హెగ్డేనే. ఆమె ఇప్పుడు ఎంత బిజీ అంటే కాల్‌షీట్లు, డేట్స్ అడ్జెస్ట్ చేయలేక కొన్ని సినిమాలను కూడా వదిలేసుకోవాల్సి వచ్చింది.

కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌లో నటిస్తోన్న పూజా హెగ్డే:

ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమాలో పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అటు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఓ పాటలో మెరిసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా కోసం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రత్యేకించి ఈ సినిమాలో తెరకెక్కించిన బతుకమ్మ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తెలంగాణ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ పాటను రూపొందించారు. ప్రస్తుతం 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' యూనిట్ మొత్తం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా వున్న సంగతి తెలిసిందే.

పూజా హెగ్డే తుళు ఆడపడుచు:

అయితే స్వల్ప విరామం దొరకడంతో హీరోయిన్ పూజా హెగ్డే తన సొంతూరుకు వెళ్లారు. కర్ణాటకలోని రేవు పట్టణం మంగళూరు పూజా హెగ్డే సొంతూరు. ముంబైలో వుంటున్నప్పటికీ ఆమె అప్పుడప్పుడు తన సొంతూరుకు వెళుతూ వుంటారు. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపించే పూజా.. తన వూరిలో మాత్రం సాంప్రదాయబద్ధంగా కనిపించేందుకే ప్రాధాన్యతనిస్తారు. దీనిలో భాగంగా చుడిదార్‌ ధరించి.. ప్రకృతిలో గడిపారు. పువ్వులు, ఆకులతో ఆడుతూ సరదాగా గడిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More News

గ్రాండ్‌గా ఉపాసన బేబీషవర్ ఫంక్షన్.. సందడి చేసిన బన్నీ, సానియా మీర్జా, కనికా కపూర్

పెళ్లయిన దాదాపు 12 ఏళ్ల తర్వాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ - ఉపాసన దంపతులు ఇటీవల శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. ఉపాసన తాను గర్భందాల్చినట్లు ప్రకటించి మెగా కుటుంబాన్ని

ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్‌ స్క్రీన్‌పై ‘సింహాద్రి’.. రీ రిలీజ్‌లోనూ సింగమలై సంచలనాలు

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘‘సింహాద్రి’’ సినిమా ప్రభంజనం అంతా ఇంతా కాదు. 20 ఏళ్ల క్రితం 2003 జూలై 9న రిలీజైన ఈ సినిమాలో

Devi Sri Prasad: బాస్‌తో బ్రేక్‌ఫాస్ట్ ... చిరంజీవి ఇంటికి దేవిశ్రీ ఎందుకెళ్లినట్లు..?

దేవి శ్రీ ప్రసాద్.. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌. కొత్తగా ఎంతమంది వస్తున్నా.. ఇప్పటికీ టాప్ ప్లేస్ ఆయనదే. దాదాపు పాతికేళ్లుగా చిత్ర సీమకు సేవ చేస్తున్న దేవికి ఇప్పటికీ యువతలో

నాకు, నా కుటుంబానికి ప్రాణహానీ వుంది.. పోలీసులకు సింగర్ సునీత భర్త రామ్ ఫిర్యాదు

తనకు, తన కుటుంబానికి ఓ వ్యక్తి నుంచి ప్రాణహానీ వుందంటూ ప్రముఖ నేపథ్య గాయనీ సునీత భర్త రామ్ వీరపనేని పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్

Rahul Gandhi: ఎంపీగా అనర్హత వేటు.. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్, లగేజ్ తీసుకుని ఎక్కడికి వెళ్లారంటే..?

లోక్‌సభ సభ్యుడిగా అనర్హత వేటు పడటంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రభుత్వం తనకు కేటాయించిన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్‌లో వుంటున్న