ప్రభాస్ తో పూజాహెగ్డే..?
Send us your feedback to audioarticles@vaarta.com
పూజా హెగ్డే వరుస సినిమాలను సైన్ చేస్తుంది. వివరాల్లోకెళ్తే.. `ఒక లైలా కోసం` సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మడు తర్వాత `ముకుంద`, `డీజే దువ్వాడ జగన్నాథమ్` సినిమాల్లో నటించింది. హీరోయిన్‌గా పూజా హెగ్డేకు సినిమాలు క్యూ కట్టకున్నా తొందరపడలేదు. ఇప్పుడు ఈ అమ్మడి నిరీక్షణ ఫలించింది. ఇప్పుడు మహేష్ 25వ సినిమాలో పూజా హీరోయిన్‌గా నటిస్తుంది.
అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో కూడా పూజా హెగ్డే నటిస్తుంది. కాగా ఇప్పుడు ప్రభాస్ సాహో తర్వాత చేయబోయే సినిమాలో నటించమని యూనిట్.. పూజా హెగ్డేను సంప్రదించిందట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అంతా ఓకే అయితే పూజా హెగ్డే ప్రభాస్‌తో నటించడం ఖాయం. ఈ సినిమాను జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో కృష్ణంరాజు నిర్మించబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com